హత్యలన్నీ కత్తులతోనే ఎందుకంటే?
గ్యాంగ్‌స్టర్ నయీం తన ప్రత్యర్థులను మట్టుబెట్టే తీరు చాలా పకడ్బందీగా ఉండేది. నయీం స్కెచ్ గీస్తే.. శత్రువు బతికి బట్ట కట్టిన సందర్బాలు లేనే లేవు. మావోయిస్టు శిక్షణ, పోలీసులతో అనుబంధం వెరసి గెరిల్లా తరహా మెరుపుదాడులను రూపొందించడంలో నయీం ఆరితేరాడు. అందుకే, తనకు అడ్డు వచ్చినవారిని చెప్పి మరీ అన్న ప్రకారంగా చంపేవాడు. నయీం చేసే ప్రతీ హత్యలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించేవాడు. వాస్తవానికి ఇతనికి పోలీసులు, మావోయిస్టులు, ఉగ్రవాదులు, ఆయుధ వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయి. […]
Advertisement
గ్యాంగ్‌స్టర్ నయీం తన ప్రత్యర్థులను మట్టుబెట్టే తీరు చాలా పకడ్బందీగా ఉండేది. నయీం స్కెచ్ గీస్తే.. శత్రువు బతికి బట్ట కట్టిన సందర్బాలు లేనే లేవు. మావోయిస్టు శిక్షణ, పోలీసులతో అనుబంధం వెరసి గెరిల్లా తరహా మెరుపుదాడులను రూపొందించడంలో నయీం ఆరితేరాడు. అందుకే, తనకు అడ్డు వచ్చినవారిని చెప్పి మరీ అన్న ప్రకారంగా చంపేవాడు. నయీం చేసే ప్రతీ హత్యలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించేవాడు. వాస్తవానికి ఇతనికి పోలీసులు, మావోయిస్టులు, ఉగ్రవాదులు, ఆయుధ వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయి. నయీం వద్ద ఏకే-47 లాంటి అత్యాధునిక ఆయుధాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కానీ, ఏనాడూ నయీం వాటిని వాడిన పాపాన పోలేదు. తాను హత్య చేసిన, చేయించిన వారిలో ఎక్కువమందిని కత్తులతో చంపించాడు. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది.
కత్తులకు బదులుగా తుపాకులు వాడితే విషయం జాతీయ స్థాయికి వెళుతుంది. కేంద్ర హోం శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. కేంద్ర నిఘా సంస్థలు కూడా కన్నేస్తాయి. దీంతో మొదటికే మోసం వస్తుందన్న కోణంలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు నయీం ను హెచ్చరించారని చెబుతుంటారు. నయీం సాగించే నేరాలు రాష్ట్ర పోలీసుల చేతుల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లోకి వెళ్లడం స్థానిక నాయకులకు, అతని మార్గదర్శకులుగా పేరొందిన పోలీసులకు ఇష్టం లేదు. అందుకే, ఎప్పుడు ఎవరిని చంపినా, చంపాలన్నా కత్తులనే వాడేవారు. దీంతో ఆ హత్యలన్నీ వ్యక్తిగత కక్షలతో జరిగాయన్న కోణంలో ఉండేలా జాగ్రత్తపడేవారు. కేసు వెంటనే మూసివేసేలా నిందితులంతా వెంటనే లొంగిపోయేవారు. దీంతో హత్య జరిగిన దాని కంటే రెట్టింపు వేగంతో కేసు ఫైలును మూసివేసేవారు. ఇదంతా పోలీసు ఉన్నతాధికారులు నయీంకు ఇచ్చిన శిక్షణే అన్నది బహిరంగ రహస్యం.
Advertisement