ఫస్ట్ లుక్ కోసం సంక్రాంతి వరకు ఆగాల్సిందే...
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడం లేదు. కాకపోతే… ఆ టైమ్ లో తమ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. నిజానికి ఈ రోజు మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ లో ఏదో ఒకటి ప్రకటిస్తారని అంతా ఎదురుచూశారు. కానీ మహేష్-మురుగ సినిమా ఫస్ట్ లుక్ సంక్రాంతి కానుకగానే వస్తుంది. ప్రస్తుతం మహేష్, మురుగదాస్ సినిమా షూటింగ్ హైదరాబాద్ […]
Advertisement
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడం లేదు. కాకపోతే… ఆ టైమ్ లో తమ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. నిజానికి ఈ రోజు మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ లో ఏదో ఒకటి ప్రకటిస్తారని అంతా ఎదురుచూశారు. కానీ మహేష్-మురుగ సినిమా ఫస్ట్ లుక్ సంక్రాంతి కానుకగానే వస్తుంది. ప్రస్తుతం మహేష్, మురుగదాస్ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. 2 రోజుల పాటు జేబీఎస్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఇంటెలిజెన్స్ ఆఫీస్ సెట్ లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ 6 నుంచి చెన్నైలో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
Advertisement