అల్లుడితో పెళ్లి.. కూతురికే సవితైన తల్లి!
కలికాలం.. పోయేకాలం అంటే ఇదేనేమో! దేశంలో వ్యామోహాల ముసుగులో బంధాలు- అనుబంధాలకు పాతరేస్తున్న మరో ఘటన బిహార్‌లో వెలుగుచూసింది. కూతురింటికి చుట్టపుచూపుగా వెళ్లిన అత్త.. అల్లుడిని ప్రేమించింది. చివరికి పెళ్లి చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మానవ సంబంధాలను ప్రశ్నించేలా చేసుకున్న వీరి పెళ్లిని పంచాయతీ పెద్దలు అంగీకరించి ఆమోద ముద్ర వేశారు. వివరాలు.. బిహార్‌కు చెందిన ఆశాదేవీ (43) తన కూతురు లలితను (19)ని సూరజ్ (22) అనే యువకుడికి ఇచ్చి వివాహం చేసింది. కొంతకాలం […]
Advertisement
కలికాలం.. పోయేకాలం అంటే ఇదేనేమో! దేశంలో వ్యామోహాల ముసుగులో బంధాలు- అనుబంధాలకు పాతరేస్తున్న మరో ఘటన బిహార్‌లో వెలుగుచూసింది. కూతురింటికి చుట్టపుచూపుగా వెళ్లిన అత్త.. అల్లుడిని ప్రేమించింది. చివరికి పెళ్లి చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మానవ సంబంధాలను ప్రశ్నించేలా చేసుకున్న వీరి పెళ్లిని పంచాయతీ పెద్దలు అంగీకరించి ఆమోద ముద్ర వేశారు.
వివరాలు.. బిహార్‌కు చెందిన ఆశాదేవీ (43) తన కూతురు లలితను (19)ని సూరజ్ (22) అనే యువకుడికి ఇచ్చి వివాహం చేసింది. కొంతకాలం క్రితం కూతురు కాపురం ఎలా ఉందో చూసి పోదామని ఆమె ఇంటికి వెళ్లింది ఆశాదేవి. ఈ క్రమంలోనే అల్లుడితో సాన్నిహిత్యం పెంచుకుంది. ఇది కాస్తా వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. తరచుగా వస్తుండటంతో తనపై ప్రేమతో వస్తుందని అనుకుంది ఆ అమాయకపు కూతురు. ఈ క్రమంలో భర్త తీరులో ఏదో మార్పు రాసాగింది. ఆశాదేవితో గంటలకొద్ది ఫోన్లో మాట్లాడుతున్నా.. అసలు విషయం తెలియక వీరి వ్యవహారాన్ని లలిత గుర్తించలేకపోయింది. సూరజ్ కూడా తరచుగా అత్తను చూసేందుకు వెళ్లేవాడు. ఈ క్రమంలో నిన్ను విడిచి ఉండలేకపోతున్నాను. నన్ను పెళ్లి చేసుకో అత్త ఆశాదేవి కోరింది. దీన్ని కాదనలేని సూరజ్ అలాగే అత్తను పెళ్లాడి ఇంటికి తీసుకెళ్లాడు. తన తల్లే తనకు సవితిగా వచ్చిన దృశ్యం చూసి ఆ అమాయకపు కూతురు లలిత సొమ్మసిల్లి కింద పడిపోయింది. విషయం గ్రామ పెద్దల వరకు వెళ్లింది. అక్కడ తెరవెనక ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ, పంచాయతీ పెద్దలు వీరి పెళ్లికి ఆమోదముద్ర వేశారు. దీంతో తన కూతురిని పుట్టింటికి తీసుకెళ్లాడు లలిత తండ్రి. ఇంత జరిగాక కూడా ఆశాదేవి తిరిగి కూతురు దగ్గరికి వెళ్లి.. మనం ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో కాపురం చేసుకుందాం.. రమ్మంటూ లలితను బతిమిలాడుతుండటం కొసమెరుపు.
Advertisement