అహంకారంతో నేను ఆ మాట అనలేదు
బన్నీ లేటెస్ట్ డైలాగ్ ఇది. మొన్నటివరకు చెప్పను బ్రదర్ అనే డైలాగ్ తో పాపులర్ అయ్యాడు అల్లు అర్జున్. ఈసారి మాత్రం నేను ఆ మాట అనలేదు అంటున్నాడు. అహంకారంతో అస్సలు అనలేదు అంటున్నాడు. కానీ గతంలో అన్న “చెప్పను బ్రదర్” అనే డైలాగ్ కు… తాజాగా వినిపిస్తున్న “అహంకారంతో నేను అలా అనలేదు” అనే డైలాగ్ కు అస్సలు సంబంధం లేదు. తన తమ్ముడు అల్లు శిరీష్ నటించిన “శ్రీరస్తు-శుభమస్తు” సినిమాకు సంబంధించి బన్నీ ఈ మాట […]
Advertisement
బన్నీ లేటెస్ట్ డైలాగ్ ఇది. మొన్నటివరకు చెప్పను బ్రదర్ అనే డైలాగ్ తో పాపులర్ అయ్యాడు అల్లు అర్జున్. ఈసారి మాత్రం నేను ఆ మాట అనలేదు అంటున్నాడు. అహంకారంతో అస్సలు అనలేదు అంటున్నాడు. కానీ గతంలో అన్న “చెప్పను బ్రదర్” అనే డైలాగ్ కు… తాజాగా వినిపిస్తున్న “అహంకారంతో నేను అలా అనలేదు” అనే డైలాగ్ కు అస్సలు సంబంధం లేదు. తన తమ్ముడు అల్లు శిరీష్ నటించిన “శ్రీరస్తు-శుభమస్తు” సినిమాకు సంబంధించి బన్నీ ఈ మాట అన్నాడు.
ఈ సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ….నేను కొన్ని సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో ముందుగానే చెప్పగలను. ఇది అహంకారంతోనో….లేక నేను మేధావిననో చెప్పడం లేదు. శ్రీరస్తు శుభమస్తు చిత్రం మంచి చిత్రం అవుతుందని ముందు నుంచి నాకనిపించింది. అందుకే ఈ సినిమా హిట్ అవుతుందని ముందే చెప్పాను. అని బన్నీ తెలిపాడు.
ఏ సినిమాకైనా ఎంత పబ్లిసిటీ చేసినా..ట్రైలర్ చూసో..ఆడియో వినో సినిమా చూడాలా వద్దా అని ఆడియోన్స్ ఫిక్స్ అవుతారు. శ్రీరస్తు శుభమస్తు…ట్రైలర్ కి చాలా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. సినిమా పూర్తయ్యాక రష్ చూసాను. నాకు మంచి సినిమా అవుతుంది అనిపించింది వెంటనే నాన్నకు కంగ్రాట్స్ చెప్పాను అని బన్నీ తెలిపాడు. సినిమాను డైరక్ట్ చేసిన పరశురాంకు తన ఫ్యామిలీ తరఫున థ్యాంక్స్ చెప్పాడు బన్నీ.
Advertisement