పెళ్ళిచూపులు కుదిరినట్టే...

కంటెంట్ ఉన్న వాడికి క‌టౌట్ అవ‌సరం లేదంటారు. అలాగే సినిమా క‌థ‌లో కంటెంట్ వుండి అది ఈ జ‌న‌రేష‌న్ ఆడియ‌న్స్ కు క‌నెక్ట్ అయితే రిజ‌ల్ట్ ఎలా వుంటుందో అన‌డానికి పెళ్లి చూపులు చిత్ర‌మే ఒక ఎగ్జాంపుల్. తరుణ్ భాస్క‌ర్ అనే కొత్త ద‌ర్శ‌కుడు చేసిన ఈ చిత్రం ఒక ట్రెండ్ సెట్ట‌ర్ అయ్యేటంతాగా ఉంది. క‌థ‌, క‌థ‌నాలు ప్ర‌జెంట్ జ‌న‌రేష‌న్ చాలా బాగున్నాయి ..ముఖ్యంగా హీరో అర్జ‌న్ ఆడియ‌న్స్ కు బాగా క‌నెక్ట్ కావ‌డంతో ఓవ‌ర్సీస్ […]

Advertisement
Update:2016-08-06 09:38 IST

కంటెంట్ ఉన్న వాడికి క‌టౌట్ అవ‌సరం లేదంటారు. అలాగే సినిమా క‌థ‌లో కంటెంట్ వుండి అది ఈ జ‌న‌రేష‌న్ ఆడియ‌న్స్ కు క‌నెక్ట్ అయితే రిజ‌ల్ట్ ఎలా వుంటుందో అన‌డానికి పెళ్లి చూపులు చిత్ర‌మే ఒక ఎగ్జాంపుల్. తరుణ్ భాస్క‌ర్ అనే కొత్త ద‌ర్శ‌కుడు చేసిన ఈ చిత్రం ఒక ట్రెండ్ సెట్ట‌ర్ అయ్యేటంతాగా ఉంది. క‌థ‌, క‌థ‌నాలు ప్ర‌జెంట్ జ‌న‌రేష‌న్ చాలా బాగున్నాయి ..ముఖ్యంగా హీరో అర్జ‌న్ ఆడియ‌న్స్ కు బాగా క‌నెక్ట్ కావ‌డంతో ఓవ‌ర్సీస్ లో మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంది.

చాలా నామినల్ ప్రైస్‌కు సినిమాను దక్కించుకున్న బయ్యర్ పెట్టుబడి మీద ఎన్నో రెట్లు ఆదాయం అందుకోబోతున్నాడు. వారం రోజుల వ్యవధిలో ఈ సినిమా అమెరికాలో 4.33 లక్షల డాలర్లు వసూలు చేయడం విశేషం. విడుదలకు ముందు రోజు ప్రిమియర్లతో 17 వేల డాలర్లు వసూలు చేసిన ‘పెళ్లిచూపులు’ రిలీజ్ డే నుంచి అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్తోంది.

మళ్లీ వీకెండ్ వచ్చేసింది కాబట్టి.. కొత్త సినిమాల రిలీజ్ ఉన్నప్పటికీ ‘పెళ్లిచూపులు’ హవా కొన‌సాగుతుందనే భావిస్తున్నారు. ఈ వీకెండ్ అయ్యేలోపే హాఫ్ మిలియన్ మార్కును దాటేయడం ఖాయం. అంటే కోటిన్నర రూపాయల బడ్జెట్లో తెరకెక్కిన ‘పెళ్లిచూపులు’.. ఒక్క అమెరికాలో మాత్రమే దానికంటే రెట్టింపు కన్నా ఎక్కువ వసూలు చేస్తోందన్నమాట. ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పడానికి ఇంతకంటే ఏమికావాలి..

Tags:    
Advertisement

Similar News