మొహంజదారో కథకు ఆధారం అవే...!
రెండు వేల సంవత్సరాలకు పూర్వమే మొహెంజొ దారో నగరాన పరిమళించిన సింధు నాగరికత ఇప్పటి ప్రపంచాన్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ వైభవాన్ని ఓ అందమైన ప్రేమకథకు ముడిపెట్టి వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు అశుతోష్ గొవారికర్. హృతిక్ రోషన్, పూజా హెగ్డే నాయకానాయికలుగా ‘మొహెంజొ దారో’ అనే చారిత్రక నేపథ్య చిత్రాన్ని తెరకెక్కించారు అశుతోష్. ఈ చిత్రం కోసం మొహెంజొదారో నగరంతో పాటు అప్పటి దుస్తులు, ఆభరణాలు, ఆయుధాలు లాంటివి పునఃసృష్టించారు. ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతుంది.. అయితే […]
Advertisement
రెండు వేల సంవత్సరాలకు పూర్వమే మొహెంజొ దారో నగరాన పరిమళించిన సింధు నాగరికత ఇప్పటి ప్రపంచాన్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ వైభవాన్ని ఓ అందమైన ప్రేమకథకు ముడిపెట్టి వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు అశుతోష్ గొవారికర్. హృతిక్ రోషన్, పూజా హెగ్డే నాయకానాయికలుగా ‘మొహెంజొ దారో’ అనే చారిత్రక నేపథ్య చిత్రాన్ని తెరకెక్కించారు అశుతోష్. ఈ చిత్రం కోసం మొహెంజొదారో నగరంతో పాటు అప్పటి దుస్తులు, ఆభరణాలు, ఆయుధాలు లాంటివి పునఃసృష్టించారు. ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతుంది.. అయితే ఈ కథకు మూలం చాల ఆసక్తికరమైన ఆధారం తో తెరకెక్కినట్లు తెలుస్తుది.
మొహంజదారో తవ్వకాల్లో బయపడిన డోలు వాయిస్తున్న పురుషుడు, నృత్యం చేస్తున్న స్త్రీ విగ్రహాల ఆధారంగానే నాయకానాయికల పాత్రలను రూపొందించారట. ఇందులో కథానాయిక పాత్రను నృత్యకారిణిగా తీర్చిదిద్దారు. సింధు కాలం నాటి యూనికార్న్ ముద్రను నాయకానాయికల మధ్య ప్రేమకథకు ముడిపెట్టారట.సింధు నాగరికత ప్రజల్లో ఎద్దుల బండి వాడకం ఉన్నట్లు ఓ బొమ్మ ద్వారా తెలుస్తోంది. అందుకే కొన్ని సన్నివేశాల్లో ఎద్దుల బళ్లు ఉపయోగించారు. అప్పట్లో వస్తు మార్పిడి విధానం ఉండేది. అందుకే ఈ చిత్రంలో ఎక్కడా నాణేలు కనిపించవట. ఈ చిత్రం ట్రైలర్స్ తోపాటు..సాంగ్స్ కు సంబంధించి 2 , నుంచి 3 నిముషాల నిడివి వున్న కొన్ని సాంగ్స్ ను యూ ట్యూబ్ కు వదలి.. సినిమా పై అంచనాలు పెంచేస్తున్నారు.
Advertisement