వరుణ దేవుడే భయపడ్డాడు " చంద్రబాబు

చంద్రబాబు అధికారంలోకి వస్తే అతివృష్టి లేకుంటే అనావృష్టి వస్తుందని మిగిలిన పార్టీల నేతలు విమర్శిస్తుంటారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నసమయంలో వరుస కరువుతో రాష్ట్రం అతలాకుతలం అయిన విషయాన్ని వారు పదేపదే గుర్తు చేస్తుంటారు. కరువు వచ్చిన సమయంలో మాట్లాడని చంద్రబాబు… ఈసారి వర్షాలు కాస్త ఆశాజనకంగా ఉండడంతో ఆ క్రెడిట్ తనదేనని చెప్పుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన చంద్రబాబు… వరుణదేవుడు తమను చూసి భయపడ్డారన్నారు. ”గతంలో ఒకసారి వర్షాలు వచ్చేవి. మరోసారి వచ్చేవి […]

Advertisement
Update:2016-08-06 10:27 IST

చంద్రబాబు అధికారంలోకి వస్తే అతివృష్టి లేకుంటే అనావృష్టి వస్తుందని మిగిలిన పార్టీల నేతలు విమర్శిస్తుంటారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నసమయంలో వరుస కరువుతో రాష్ట్రం అతలాకుతలం అయిన విషయాన్ని వారు పదేపదే గుర్తు చేస్తుంటారు. కరువు వచ్చిన సమయంలో మాట్లాడని చంద్రబాబు… ఈసారి వర్షాలు కాస్త ఆశాజనకంగా ఉండడంతో ఆ క్రెడిట్ తనదేనని చెప్పుకున్నారు.

అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన చంద్రబాబు… వరుణదేవుడు తమను చూసి భయపడ్డారన్నారు. ”గతంలో ఒకసారి వర్షాలు వచ్చేవి. మరోసారి వచ్చేవి కాదు. పంటలు ఎండిపోయేవి. అందుకే దినానికి లక్ష ఎకరాలకు నీరు అందించేలా రెయిన్‌ గన్స్ తెచ్చాం. దీంతో వరుణ దేవుడు మమ్మల్ని చూసి భయపడ్డాడు. అందుకే సకాలంలో వర్షాలు కురిపిస్తున్నాడు. ఒకవేళ కురిపించకపోయినా సరే నేను పంటలు ఎండిపోకుండా కాపాడుతా’!’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

గతంలో వరుణ దేవుడు తమ పార్టీ చేరాడని కాంగ్రెస్ వాళ్లు చెప్పుకునే వారు. చంద్రబాబు మాత్రం అందుకు రివర్స్‌లో వరుణ దేవుడు తమను చూసి భయపడ్డారని చెప్పడం విశేషం. అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలను ఆరు మీటర్ల మేర పెంచిన ఘనత తమదేనన్నారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా నదులు అనుసంధానం చేశానన్నారు. శ్రీశైలంలోని నీటిని రాయలసీమకు మళ్లిస్తామన్నారు. పట్టిసీమ వల్లే ఇది సాధ్యమైందన్నారు చంద్రబాబు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News