రాఘ‌వేంద్రుడు అలా సెట్ చేశాడు..!

ప్ర‌స్తుతం ఏ సినిమాలో అయినా అనుష్క క‌నిపిస్తే ఆడియ‌న్స్ ఫిదా అవుతున్నారు. అరంధ‌తి, బాహుబ‌లి, రాణిరుద్ర‌మ చిత్రాలు అనుష్క‌ను అభిమానుల‌కు బాగా రీచ్ చేశాయి. బాహుబ‌లి 2 లో అనుష్క న‌ట విశ్వ‌రూపం వుంటుంద‌నే టాక్ వినిపిస్తుంది. ఇదిలా వుంటే.. నాగార్జున తో అనుష్క కు స్పెష‌ల్ బంధం వుందంటారు. ఎందుకంటే త‌న తొలి హీరో నాగార్జునానే. సూప‌ర్ చిత్రంతో అనుష్క ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌రువాత డాన్, ఈ మ‌ధ్య సొగ్గాడే చిన్నినాయ‌న చిత్రాల్లో న‌టించింది. […]

Advertisement
Update:2016-08-06 09:10 IST
రాఘ‌వేంద్రుడు అలా సెట్ చేశాడు..!
  • whatsapp icon

ప్ర‌స్తుతం ఏ సినిమాలో అయినా అనుష్క క‌నిపిస్తే ఆడియ‌న్స్ ఫిదా అవుతున్నారు. అరంధ‌తి, బాహుబ‌లి, రాణిరుద్ర‌మ చిత్రాలు అనుష్క‌ను అభిమానుల‌కు బాగా రీచ్ చేశాయి. బాహుబ‌లి 2 లో అనుష్క న‌ట విశ్వ‌రూపం వుంటుంద‌నే టాక్ వినిపిస్తుంది. ఇదిలా వుంటే.. నాగార్జున తో అనుష్క కు స్పెష‌ల్ బంధం వుందంటారు. ఎందుకంటే త‌న తొలి హీరో నాగార్జునానే. సూప‌ర్ చిత్రంతో అనుష్క ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌రువాత డాన్, ఈ మ‌ధ్య సొగ్గాడే చిన్నినాయ‌న చిత్రాల్లో న‌టించింది.

ఇక తెలుగులో భ‌క్తి ర‌స చిత్రాలంటే ప్ర‌స్తుతం రాఘ‌వేంద్ర‌రావు, నాగార్జున‌ల‌దే కాంబినేష‌న్ అని చెప్పాలి. అన్న‌మ‌య్య తో మొద‌లెట్టి.. శిరిడి సాయి వ‌రకు మూడు చిత్రాలు చేసి ఆడియ‌న్స్ ను మెప్పించారు. తాజాగా నాగార్జున ప్రధాన ప్రాతలో రూపొందుతున్న ”ఓం నమో వేంకటేశాయ” సినిమాలో అనుష్క ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ సీరియల్స్ నటుడు సౌరభ పోషిస్టున్న శ్రీమహా విష్ణువు పాత్రను మోషన్ పోస్టర్ ద్వారా ఆవిష్కరించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇప్పుడు అనుష్క పాత్ర ఎలా ఉండబోతోందో ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఒక మహా భక్తురాలు ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది అనుష్క. అయితే కృష్ణమ్మ అనే పేరుతో కలియుగ అవతారమైన వేంకటేశ్వరుని భక్తురాలిగా కనిపించడం ఇంకా బాగుంది అంటున్నారు డివోషనల్ సినిమా లవర్స్.

Full View

Tags:    
Advertisement

Similar News