కేవీపీ బిల్లుకు షాక్‌ ఇచ్చిన కురియన్

ప్రత్యేక హోదాకోసం కాంగ్రెస్‌ ఎంపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై రాజ్యసభలో దుమారం రేగింది. పలు దఫాలుగా సభ ఈ బిల్లుపై చర్చించింది. చివరకు కాంగ్రెస్, ఇతర పార్టీ ఓటింగ్‌కు పట్టుబట్టగా… ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు మనీ బిల్లు అని కాబట్టి మనీ బిల్లుపై ఓటింగ్ చేపట్టే అధికారం రాజ్యసభకు లేదని వాదించారు. ఇందుకు కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి బిల్లు కూడా ఆర్థిక అంశాలతోనే ముడిపడి ఉంటుందని […]

Advertisement
Update:2016-08-05 10:25 IST

ప్రత్యేక హోదాకోసం కాంగ్రెస్‌ ఎంపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై రాజ్యసభలో దుమారం రేగింది. పలు దఫాలుగా సభ ఈ బిల్లుపై చర్చించింది. చివరకు కాంగ్రెస్, ఇతర పార్టీ ఓటింగ్‌కు పట్టుబట్టగా… ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు మనీ బిల్లు అని కాబట్టి మనీ బిల్లుపై ఓటింగ్ చేపట్టే అధికారం రాజ్యసభకు లేదని వాదించారు. ఇందుకు కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రతి బిల్లు కూడా ఆర్థిక అంశాలతోనే ముడిపడి ఉంటుందని అలా చెప్పి తిరస్కరిస్తూ పోతే సభ పవర్‌ ఏంటో తెల్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుందని కాంగ్రెస్ సభ్యుడు కపిల్ సిబల్ చెప్పారు. జైరాం రమేష్, అజాద్‌, ఏచూరి తదితరులు కూడా కేవీపీ బిల్‌ను మనీ బిల్లు అనడం సరికాదన్నారు. చివరకు ఈ అంశంపై పలు పార్టీ సభ్యుల అభిప్రాయం తెలుసుకున్న డిప్యూటీ చైర్మన్ కురియన్ చివరకు తానే రూలింగ్ ఇచ్చారు. ఒక బిల్లు మనీ బిల్లా కాదా అన్న అనుమానం వచ్చినప్పుడు రాజ్యసభ చైర్ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

అలాంటి పరిస్థితిలో లోక్‌సభ స్పీకర్‌ నుంచి సూచన తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కాబట్టి కేవీపీ బిల్లు మనీ బిల్లా కాదా అన్నది తేల్చాల్సిందిగా ఈ అంశాన్ని లోక్‌సభ స్పీకర్‌కు పంపుతున్నట్టు ప్రకటించారు. దీంతో కేవీపీ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. కురియన్ ప్రకటనపై కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. పోడియంను చుట్టుముట్టారు. సభను స్తంభింపచేశారు. దీంతో సభను కురియన్ సోమవారానికి వాయిదా వేశారు. మొత్తానికి కేవీపీ బిల్లు మనీ బిల్లా కాదా అన్నది లోక్‌ సభ స్పీకర్‌ పరధిలోకి వెళ్లిపోయింది. లోక్‌సభ స్పీకర్ ఇది మనీ బిల్లు కాదంటేనే కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరుగుతుంది. అది జరగడం దాదాపు అసాధ్యమే. మరోసారి ప్రత్యేక హోదా అంశానికి కేంద్రం సమర్థవంతంగానే గండి కొట్టింది.

Click on Image to Read:

Also Read క‌బాలిని కూడా వ‌ద‌ల్లేదు..!

17 ఏళ్ల త‌ర్వాత గౌత‌మిని చూడ‌బోతున్నాం…!

విడాకులు తీసుకోవడం గ్యారెంటీ…

 

Tags:    
Advertisement

Similar News