రాష్ట్రపతినీ వదిలిపెట్టని పచ్చమీడియా
చంద్రబాబు ఇప్పుడు ఓదార్పు కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఉన్నారు. రాష్ట్రంలో ఒక్క టీడీపీ నేతలు మినహా మిగిలిన వారందరూ చంద్రబాబు పాలనను దుమ్మెత్తిపోస్తున్నారు. బాబు ఆడిన మోసపూరిత చదరంగంలో ఓడిన రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు శాపనార్థాలు పెడుతున్నారు. దీంతో ఏదో మాట వరుసకు ”చంద్రబాబు బాగా చేస్తున్నారు”అని ఎవరైనా అంటే చాలు పచ్చమీడియా ప్రముఖంగా ప్రచురించుకుని పరవశిస్తోంది. తాజాగా పుష్కరాలకు ఆహ్వానించేందుకు చంద్రబాబు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈ సమయంలో […]
చంద్రబాబు ఇప్పుడు ఓదార్పు కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఉన్నారు. రాష్ట్రంలో ఒక్క టీడీపీ నేతలు మినహా మిగిలిన వారందరూ చంద్రబాబు పాలనను దుమ్మెత్తిపోస్తున్నారు. బాబు ఆడిన మోసపూరిత చదరంగంలో ఓడిన రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు శాపనార్థాలు పెడుతున్నారు. దీంతో ఏదో మాట వరుసకు ”చంద్రబాబు బాగా చేస్తున్నారు”అని ఎవరైనా అంటే చాలు పచ్చమీడియా ప్రముఖంగా ప్రచురించుకుని పరవశిస్తోంది.
తాజాగా పుష్కరాలకు ఆహ్వానించేందుకు చంద్రబాబు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈ సమయంలో ఆయన ఈయన్ను పొగడ్తలతో ముంచెత్తారట. ఈ సమయంలో పక్కనే ఉన్నట్టుగా పెద్ద పచ్చపత్రిక కథనాన్ని అచ్చేసుకుంది. ”అందరూ మీలా పనిచేస్తే దేశం అభివృద్ధి దిశలో దూసుకెళ్తుంది” అని ప్రణబ్ చెప్పారట. మరో అణిముత్యం లాంటి వ్యాఖ్యను కూడా రాసుకుని పరవశించింది సదరు పత్రిక. ”రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయంలో అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఆ విషయంలో అందరికంటే మీరు ముందుంటారు’’ అని ప్రణబ్‌ముఖర్జీ చంద్రబాబును కీర్తించారట. నిజంగా ప్రణబ్ ముఖర్జీ అలాఅన్నారో లేదో గానీ ఏపీలో పరిస్థితులకు, రాష్ట్రపతి చెప్పినట్టు పెద్ద పచ్చపత్రిక రాసిన కథకు పొంతన ఉందా?. చంద్రబాబు ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయం చేస్తున్నారని ప్రణబ్ చెప్పారట!. మరి..
పొద్దున లేస్తే నిద్రపోయే దాకా పక్క పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కొనాలి?. ఎంతకు కొనాలి?. వంటి వ్యవహారాలు రాజకీయం కిందకు రావా? లేక పచ్చపెద్ద పత్రికచెప్పినట్టు అభివృద్ధి కిందకు వస్తాయా?. ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటే మిగిలిన రాష్ట్రాలు కూడా చిప్ప తీసుకుని తిరగాల్సిఉంటుంది. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా చంద్రబాబు లాగా మూడు క్యాంపు ఆఫీసులు, మూడు ఇల్లు, ఐదు కిలోమీటర్ల ప్రయాణానికి కూడా హెలికాప్టర్, మూడు వందల కిలోమీటర్ల ప్రయాణానికి కూడా ప్రత్యేక విమానం వాడడం, కుటుంబసభ్యులను ఫైవ్ స్టార్ హోటల్లో కాపురానికి పెట్టడం, కులాల వారీగా ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి రాష్ట్రాన్నికులాల కుంపటిగా మార్చడం, ప్రతిపక్ష నేతలనైతే వెంటనే బొక్కలో వేసేయడం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే మాత్రం బాధితులనే పిలిపించి బెదిరింపు పంచాయితీ చేయడం, డబ్బులు లేవంటూనే పుష్కరాల పేరుతో వేల కోట్లు దోచేయడం, ఢిల్లీ లాబీయింగ్‌లకు పవిత్రమైన తిరుమల లడ్డూలను కూడా వాడుకోవడం వంటి పనుల విషయంలో చంద్రబాబును ఇతర ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకోవాలా?. ఏదో కలవడానికి వచ్చాడు కదాని మర్యాదపూర్వకంగా … బాగానే పనిచేస్తున్నారని రాష్ట్రపతి ఒక మాట అని ఉండవచ్చు. దాన్ని కూడా పబ్లిసిటీ కోసం వాడుకోవడం బట్టే చంద్రబాబు, పచ్చపెద్ద పత్రిక ఏ రేంజ్ లో పేట్రేగిపోతోందో ఇట్టే చెప్పవచ్చు.
Click on Image to Read: