123 అమలు చేసి తీరుతాం
జీవో నెంబరు 123ను కొట్టివేసినా ప్రభుత్వంలో ఎలాంటి నిరుత్సాహం లేదు. ఈ జీవోపై రివ్యూ పిటిషన్ వేస్తామని స్పష్టం చేసింది. అంతేతప్ప జీవోను రద్దు చేసే ఆలోచన ఏదీ లేదని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన చాలా తీర్పులు ఆ పై బెంచ్‌లో సానుకూలంగా వచ్చిన విషయాలను గుర్తు చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. జీవోలో ఎలాంటి లోపాలు లేవు. ఇప్పటికే 25 వేల ఎకరాలు సేకరించామని, ఈ పరిస్థితుల్లో […]
Advertisement
జీవో నెంబరు 123ను కొట్టివేసినా ప్రభుత్వంలో ఎలాంటి నిరుత్సాహం లేదు. ఈ జీవోపై రివ్యూ పిటిషన్ వేస్తామని స్పష్టం చేసింది. అంతేతప్ప జీవోను రద్దు చేసే ఆలోచన ఏదీ లేదని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన చాలా తీర్పులు ఆ పై బెంచ్‌లో సానుకూలంగా వచ్చిన విషయాలను గుర్తు చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. జీవోలో ఎలాంటి లోపాలు లేవు. ఇప్పటికే 25 వేల ఎకరాలు సేకరించామని, ఈ పరిస్థితుల్లో వెనక్కి వెళ్లలేమని తేల్చేశారు. 2013 జీవోకు లోబడే 123ను విడుదల చేశాం. దీని ద్వారా భూ నిర్వాసితులకు గతంతో పోలిస్తే.. మెరుగైన ఫలితం అందుతుంది. మరింత మెరుగైన మౌలిక వసతుల కల్పనకు వీలవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పండగ చేసుకుంటున్న ప్రతిపక్షాలు..!
ఎర్రవల్లి ప్రజలు భూ సేకరణకు ముందుకు వచ్చిన రోజే.. హైకోర్టు తీర్పునివ్వడంతో ప్రతిపక్షాలు పండగ చేసుకుంటున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీల నాయకులు సంబరాలు జరుపుకున్నాయి. తమ పోరాటానికి ఫలితం దక్కిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా జరిపిన భూ సేకరణపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులా మారిందని పలువురు వ్యాఖ్యానించారు.
Advertisement