టీడీపీలోకి బెజవాడ సీనియర్ నేత!

ఏపీ కాంగ్రెస్ కోలుకునేపరిస్థితి లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత దేవినేని నెహ్రు, బూరగడ్డ వేదవ్యాస్‌లు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. త్వరలోనే వారిద్దరూ సైకిల్ ఎక్కనున్నారు. దేవినేని నెహ్రును పార్టీలోకి తీసుకొచ్చేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం గాలి ముద్దుకృష్ణమనాయుడు… నెహ్రు ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. చంద్రబాబుతో ఉన్న విబేధాల కారణంగా నెహ్రు టీడీపీలో చేరేందుకు తొలుత నిరాకరించారు. అయితే కొడుకు […]

Advertisement
Update:2016-08-03 01:10 IST

ఏపీ కాంగ్రెస్ కోలుకునేపరిస్థితి లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత దేవినేని నెహ్రు, బూరగడ్డ వేదవ్యాస్‌లు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. త్వరలోనే వారిద్దరూ సైకిల్ ఎక్కనున్నారు. దేవినేని నెహ్రును పార్టీలోకి తీసుకొచ్చేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం గాలి ముద్దుకృష్ణమనాయుడు… నెహ్రు ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. చంద్రబాబుతో ఉన్న విబేధాల కారణంగా నెహ్రు టీడీపీలో చేరేందుకు తొలుత నిరాకరించారు. అయితే కొడుకు రాజకీయ జీవితాన్నిదృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ముద్దుకృష్ణమనాయుడు సూచించారు.

ఈ నేపథ్యంలో నెహ్రు టీడీపీలో చేరేందుకు సిద్ధపడ్డారని చెబుతున్నారు. నెహ్రు తొలుత టీడీపీలోనే ఉండేవారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అయినప్పటికీ పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిపోవడంతో తర్వాత దేవినేని నెహ్రు కాంగ్రెస్‌లో చేరిపోయారు. రెండేళ్లుగా చంద్రబాబు విధానాలను కూడా నెహ్రూ విమర్శిస్తూ వచ్చారు. అయితే చివరకు సామాజికవర్గం ఒత్తిడి, కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నెహ్రు టీడీపీలో చేరేందుకు సిద్ధపడ్డారని చెబుతున్నారు. ఇక బూరగడ్డ వేదవ్యాస్ ఉమ్మడి ఏపీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. సుధీర్ఘకాలం కాంగ్రెస్‌లో పనిచేసిన వేదవ్యాస్ ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరారు. ఆపార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లో ఉంటున్నారు. కాంగ్రెస్‌ కోలుకునే సూచనలు ఏమాత్రం లేకపోవడం వల్లే వీరిద్దరూ టీడీపీలోకి వెళ్తున్నారు.

Also Read:

డబ్బు కోసం నేను అలా చేయను…

సన్నీలియోన్ మనస్సు దోచుకున్న బాహుబలి

అది అంత తేలికైన విషయం కాదు..అలియ‌భ‌ట్‌..!

నాకంటే గొప్పొళ్లున్నారు అంటున్న స‌మంత‌..!

సెక్స్ అడిక్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్…

వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…

నా చావు నేను చ‌స్తా అంటున్న రాజ‌మౌళి!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News