అమ్మాయిల హాస్టల్‌లోకి చొరబడేందుకు మంత్రి కుమారుడి యత్నం
గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి కుమారుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. తప్పతాగి ఏకంగా అమ్మాయిల హాస్టల్ లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. అయితే అధికారబలంతో పోలీసుల నోర్లు మూయించారు. దీనిపై ప్రముఖ దినపత్రిక ఆంధ్రభూమి కథనాన్ని ప్రచురించింది. మంత్రి కుమారుడు అర్థరాత్రి ఫుల్‌గా మద్యం సేవించి జేసీ కళాశాల సమపంలోని బాలికల హాస్టల్ వద్దకు వెళ్లాడు. ఒళ్లు తెలీని మైకంలో తనస్నేహితులతో కలిసి హాస్టల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరి రభస గమనించి […]
గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి కుమారుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. తప్పతాగి ఏకంగా అమ్మాయిల హాస్టల్ లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. అయితే అధికారబలంతో పోలీసుల నోర్లు మూయించారు. దీనిపై ప్రముఖ దినపత్రిక ఆంధ్రభూమి కథనాన్ని ప్రచురించింది.
మంత్రి కుమారుడు అర్థరాత్రి ఫుల్‌గా మద్యం సేవించి జేసీ కళాశాల సమపంలోని బాలికల హాస్టల్ వద్దకు వెళ్లాడు. ఒళ్లు తెలీని మైకంలో తనస్నేహితులతో కలిసి హాస్టల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరి రభస గమనించి పక్కనే ఉన్న బాలుర హాస్టల్ విద్యార్థులు అక్కడికి వచ్చారు. మంత్రి కుమారుడు, అతడి స్నేహితులు అమ్మాయిల హాస్టల్‌లోకి వెళ్లకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. వారితోనూ మంత్రి కుమారుడు గొడవ పడ్డారు. చివరకు సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు మంత్రి కుమారుడిని అక్కడి నుంచి పంపించివేశారని పత్రిక కథనం. సదరు మంత్రి కుమారుడు ఎవరన్న దానిపై ఆంధ్రభూమి పత్రిక క్లూ కూడా ఇచ్చింది. ఇదే వ్యక్తి గతంలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఒక యువతిని వెంబడించి స్థానికుల చేతిలో దేహశుద్ది చేయించుకున్నారని వెల్లడించింది.
ఇలా మంత్రి కుమారుడు ఏకంగా అమ్మాయిల హాస్టల్‌లోకి చొరబడే ప్రయత్నించడం స్థానికులను ఆందోళన కలిగిస్తోందని పత్రిక వెల్లడించింది. విజయవాడలో జరిగిన అయేషా మీరా హత్య ఉదంతాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది.
Click on Image to Read: