అమ‌లాపాల్  కాపురంలో  చిచ్చుకు అదే కార‌ణ‌మా..! 

హీరోయిన్ అమ‌లాపాల్  కాపురంలో చిచ్చుకు కార‌ణం   సినిమాలే అని తెలుస్తుంది.   న‌టిగా  నాన్నా చిత్రంతో  తెరంగ‌ట్ర‌మ్  ( త‌మిళ్, తెలుగు) చేసిన  ఈ మ‌ల‌యాళ బ్యూటీ..   నాన్న సినిమా  స‌మ‌యంలో ఆ చిత్ర ద‌ర్శ‌కుడు  విజ‌య్ తో  ప్రేమ‌లో ప‌డింది.  ఎట్ట‌కేల‌కు  గ‌త యేడాది  ఇద్ద‌రు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కి ముందు ఇద్ద‌రు ప్రేమ వ్య‌వ‌హారంలో  మునిగి తేలిన‌ప్ప‌టికి  ఎవ‌రికి  ఎవ‌రు  బ‌య‌ట ప‌డ‌లేదు. మొత్తం మీద ఈ మ‌ధ్య  కాపురంలో […]

Advertisement
Update:2016-08-01 03:15 IST
హీరోయిన్ అమ‌లాపాల్ కాపురంలో చిచ్చుకు కార‌ణం సినిమాలే అని తెలుస్తుంది. న‌టిగా నాన్నా చిత్రంతో తెరంగ‌ట్ర‌మ్ ( త‌మిళ్, తెలుగు) చేసిన ఈ మ‌ల‌యాళ బ్యూటీ.. నాన్న సినిమా స‌మ‌యంలో ఆ చిత్ర ద‌ర్శ‌కుడు విజ‌య్ తో ప్రేమ‌లో ప‌డింది. ఎట్ట‌కేల‌కు గ‌త యేడాది ఇద్ద‌రు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కి ముందు ఇద్ద‌రు ప్రేమ వ్య‌వ‌హారంలో మునిగి తేలిన‌ప్ప‌టికి ఎవ‌రికి ఎవ‌రు బ‌య‌ట ప‌డ‌లేదు.
మొత్తం మీద ఈ మ‌ధ్య కాపురంలో క‌ల‌త‌లు ప్రారంభం అయ్యాయి. ఇద్ద‌రు డైవోర్స్ తీసుకుంటున్నార‌నే వార్త‌లు గుప్పుమన్నాయి.దీనిపై విజయ్ తండ్రి ఏ.ఎల్ అళగప్పన్ స్వయంగా విజయ్, అమలాపాల్ వీడిపోయారని ప్రకటించారు. ఈ విషయమై ఆయన తమిళ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. రీసెంట్ గా మీడియాతో ఎల్ అళగప్పన్ మాట్లాడుతూ…అమలాపాల్ ని దారుణంగా తిట్టిపోసినంత పని చేసినంత పనిచేసాడని తెలుస్తోంది.
ఆయన చెప్పేదాని ప్రకారం…ఇంట్లో పెద్దలెవరకి కానీ, ఆమె తన భర్త విజయ్ కు కానీ ఆమె గౌరవం ఇవ్వలేదు. దాంతో ఆమె భర్త కానీ, అత్తామామలు కానీ ఆమె విషయంలో సంతోషంగా లేరు. ఆమె యాక్టివ్ గా సినిమాల్లో నటించటం, ముఖ్యంగా కోలివుడ్ లో నటించటం అసలు ఇష్టంలేదని చెప్తున్నా ఆమె వినలేదట. కేవలం ఫ్యామిలీ లైఫ్ పైనే కాన్సర్టేట్ చేయమని విజయ్ కోరినా, అమలా పాల్ పట్టించుకోలేదు. తాను సినిమాలు వదలలేనని తేల్చి చెప్పటమే కారణం అంటున్నారు. అయితే అసలు కారణం వేరని, డిల్లీ లోని ఓ ఫ్యాషన్ డిజైనర్ ఆమె రిలేషనే కారణమని మరోవైపు మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News