నా చావు నేను చస్తా అంటున్న రాజమౌళి!
రెండు మూడురోజులుగా నా చావు నేను చస్తా.. నీకెందుకు? అనే మాటను రాజమౌళి వాడుతున్నాడు. ఇంతకీ ఏమైందని? ఆయన్నెవరైనా ఏమైనా అన్నారా? అని సందేహం వస్తోంది కదా! విషయం ఏంటంటే..? బాహుబలి-2 చిత్రీకరణలో ఉన్న రాజమౌళికి కాస్త తీరిక దొరకడంతో ఇటీవల విడుదలైన పెళ్లి చూపులు సినిమా చూశాడంట. రోటీన్ కు భిన్నంగా ఉన్న ఈ సినిమా ఎంతో ఫ్రెష్‌గా ఉందని ట్వీట్ చేశాడు. సినిమా అంతా కొత్తగా ఉంది. మేకింగ్‌లో తరుణ్ భాస్కర్ చాలా జాగ్రత్తలు […]
Advertisement
రెండు మూడురోజులుగా నా చావు నేను చస్తా.. నీకెందుకు? అనే మాటను రాజమౌళి వాడుతున్నాడు. ఇంతకీ ఏమైందని? ఆయన్నెవరైనా ఏమైనా అన్నారా? అని సందేహం వస్తోంది కదా! విషయం ఏంటంటే..? బాహుబలి-2 చిత్రీకరణలో ఉన్న రాజమౌళికి కాస్త తీరిక దొరకడంతో ఇటీవల విడుదలైన పెళ్లి చూపులు సినిమా చూశాడంట. రోటీన్ కు భిన్నంగా ఉన్న ఈ సినిమా ఎంతో ఫ్రెష్‌గా ఉందని ట్వీట్ చేశాడు. సినిమా అంతా కొత్తగా ఉంది. మేకింగ్‌లో తరుణ్ భాస్కర్ చాలా జాగ్రత్తలు తీసుకుని శ్రద్ధగా చేశాడని ప్రశంసించాడు. సినిమాలోని అందమైన సన్నివేశాలు పదే పదే నా మనసును తాకుతోంటే చక్కటి అనుభూతికి గురవుతున్నానని వెల్లడించాడు. ముఖ్యంగా సినిమాలో హీరో స్నేహితురాలు ప్రియదర్శిని పాత్ర రాజమౌళిని బాగా ఇంప్రెస్ చేసిందట. తనను చికాకు పెట్టిన వారందరితో నా చావు నేను చస్తా.. నీకెందుకు? అని ముఖం మీద చెప్పేసే డైలాగ్ అన్నింటికంటే.. బాగా నచ్చింది అని ట్వీట్ చేశాడు.
తెలుగు ఇండస్ర్టీలో కొంతకాలంగా ఒక సెంటిమెంట్ బాగా వర్కవుట్ అవుతోంది. రాజమౌళి మెచ్చుకుంటే ఆ సినిమా బంపర్ హిట్ అవుతుందని. నాలుగేళ్ల కింద వచ్చిన హృదయ కాలేయం నుంచి నేటి పెళ్లి చూపులు వరకు బాగున్న చిన్న సినిమాను ఆయన అభినందిస్తూనే ఉన్నారు. తాజాగా పెళ్లి చూపులు సినిమాను ఆయన మెచ్చుకోవడం.. సినిమాకు బాగా కలిసి వస్తుందంటున్నారు సినీ ప్రియులు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి తమ సినిమాను మెచ్చుకునే సరికి చిత్ర యూనిట్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఇంతకంటే వేరే సర్టిఫికెట్ ఇంకేం కావాలి? అని పండగ చేసుకుంటున్నారు.
Advertisement