యూత్ ఆలోచనల్ని కట్టి పడేశాడు...!
సినిమా అంటే ఇలానే ఉండాలి అనే రూల్ లేదు. సినిమా అంటే సామాజిక మాధ్యమం. మనుషుల్ని ప్రభావితం చేయగల పవర్ ఫుల్ మీడియా వ్యాపారాత్మకం అయినప్పటికి..సగటు మనిషి జీవితాన్ని తెరమీద ఎమోషనల్ గా చూపించగలిగినప్పుడు అది ఆడియన్స్ కు కనెక్ట్ అయితే…స్టార్స్ ..సూపర్ స్టార్స్ లేక పోయినా బ్రహ్మరధం పడతారు. శుక్రవారం విడుదలైన పెళ్లిచూపులు చిత్రం ఈ కోవలోకే వస్తుంది. ఇప్పటి వరకు కొన్ని లఘు చిత్రాలు చేసిన తరుణ్ భాస్కర్ అనే కొత్తబ్బాయి.. పెళ్లి చూపులు […]
Advertisement
సినిమా అంటే ఇలానే ఉండాలి అనే రూల్ లేదు. సినిమా అంటే సామాజిక మాధ్యమం. మనుషుల్ని ప్రభావితం చేయగల పవర్ ఫుల్ మీడియా వ్యాపారాత్మకం అయినప్పటికి..సగటు మనిషి జీవితాన్ని తెరమీద ఎమోషనల్ గా చూపించగలిగినప్పుడు అది ఆడియన్స్ కు కనెక్ట్ అయితే…స్టార్స్ ..సూపర్ స్టార్స్ లేక పోయినా బ్రహ్మరధం పడతారు.
శుక్రవారం విడుదలైన పెళ్లిచూపులు చిత్రం ఈ కోవలోకే వస్తుంది. ఇప్పటి వరకు కొన్ని లఘు చిత్రాలు చేసిన తరుణ్ భాస్కర్ అనే కొత్తబ్బాయి.. పెళ్లి చూపులు చిత్రం చేశాడు. పిల్లలు, పేరెంట్స్ ఆలోచన విధానాని ప్రతిబింబిస్తూ తీశాడు. ఇప్పటి జనరేషన్ పిల్లలు పెళ్లి..కెరీర్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు. ఆడపిల్లను పేరెంట్స్ ఎలా చూస్తున్నారు. అలాగే అబ్బాయి అయితే ఎలా చూస్తున్నారు. ఇటువంటి అంశాల్ని.. విజయ్, రీతు వర్మ అనే నటీ నటులతో పాటు ..మరి కొంతమంది ఆర్టిస్ట్ లతో దర్శకుడు తరుణ్ భాస్కర్ ఎమోష్ నల్ రియలిస్టిక్ ఫిల్మ్ గా చేసి మెప్పించారు. అర్బన్ ఆడియన్స్ కు ఈ చిత్రం బాగా రీచ్ అయిపోయినట్లే మరి. తరుణ్ భాస్కర్ రూపంలో ఇండస్ట్రీకి ఒక ప్రతిభా వంతమైన దర్శకుడు దొరికినట్లే.
Advertisement