"పెళ్ళి చూపులు" సినిమా రివ్యూ

టైటిల్ :  “పెళ్ళి చూపులు” సినిమా రివ్యూ రేటింగ్: 3.5 తారాగణం : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రీతూవ‌ర్మ‌, నందూ త‌దిత‌రులు సంగీతం :   వివేక్ సాగ‌ర్‌ దర్శకత్వం :  త‌రుణ్ భాస్క‌ర్‌ నిర్మాత‌లు: రాజ్‌కందుకూరి, య‌ష్ రంగినేని హీరో ఇమేజ్ చ‌ట్రంలో బందీ అయిపోయిన తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌నుసును ఉల్లాస‌ప‌రిచే చిత్రాలు అడ‌పాద‌డ‌పా వ‌చ్చిపోతుంటాయి. ఆ కోవ‌లో నిలిచే అచ్చ‌తెలుగు చిత్రం పెళ్లి చూపులు. బంధాలు, అనుబంధాలు, మాన‌వ, వ్యాపార సంబంధాలు క‌ల‌బోసిన చిత్రంగా విడుద‌ల‌కు ముందే మంచి […]

Advertisement
Update:2016-07-29 10:55 IST

టైటిల్ : “పెళ్ళి చూపులు” సినిమా రివ్యూ
రేటింగ్: 3.5
తారాగణం : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రీతూవ‌ర్మ‌, నందూ త‌దిత‌రులు
సంగీతం : వివేక్ సాగ‌ర్‌
దర్శకత్వం : త‌రుణ్ భాస్క‌ర్‌
నిర్మాత‌లు: రాజ్‌కందుకూరి, య‌ష్ రంగినేని

హీరో ఇమేజ్ చ‌ట్రంలో బందీ అయిపోయిన తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌నుసును ఉల్లాస‌ప‌రిచే చిత్రాలు అడ‌పాద‌డ‌పా వ‌చ్చిపోతుంటాయి. ఆ కోవ‌లో నిలిచే అచ్చ‌తెలుగు చిత్రం పెళ్లి చూపులు. బంధాలు, అనుబంధాలు, మాన‌వ, వ్యాపార సంబంధాలు క‌ల‌బోసిన చిత్రంగా విడుద‌ల‌కు ముందే మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్న‌ది. మాంచి మౌత్ టాక్‌తో జూలై 29న ఈ చిత్రం విడుద‌లైంది. రిలీజ్‌కు ముందే విమ‌ర్శ‌కులను ఏవిధంగా మెప్పించిద‌నే విష‌యాన్ని తెలుసుకోవాలంటే ఈ చిత్రం క‌థ ఏంట‌న‌ది తెలుసుకొందాం.
ఎలాంటి బాధ్యత‌లు, భ‌విష్య‌త్ అంటే ఎలాంటి భ‌యం లేని ఈత‌రం కుర్రాడు ప్ర‌శాంత్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌). జాత‌కం పెళ్లి జ‌రిగితేనే బాగుప‌డుతాడ‌న్న జోత్యుష్కుడి స‌ల‌హాతో ప్ర‌శాంత్‌కు తండ్రి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. పెళ్లి చూపుల స‌మ‌యంలో ఓ త‌మాషా సంఘ‌ట‌న కార‌ణంగా చిత్ర (రీతూ వ‌ర్మ‌)ను క‌లుసుకొంటారు. చిత్ర సాధార‌ణంగా క‌నిపించే అమ్మాయిల్లా కాకుండా బాధ్య‌త‌, ల‌క్ష్య‌శుద్ధిగ‌ల అమ్మాయి. చిత్ర ప్రేమ విష‌యంలో ఓ అబ్బాయి (నందు) చేతిలో మోస‌గించ‌బ‌డుతుంది. గ‌మ్మ‌త్త‌యిన ప‌రిస్థితుల్లో జ‌రిగిన పెళ్లిచూపుల్లో ఇద్ద‌రికీ పెళ్లి మీద ఇష్టం లేద‌నే తెలుసుకొంటారు. కానీ వారి అభిరుచులు ఒక‌టేన‌ని తెలుసుకొంటారు. అక్క‌డ విడిపోయిన‌ వారిద్ద‌రూ వ్యాపారం చేయ‌డానికి ఒక్క‌టవుతారు. చిత్ర‌, ప్ర‌శాంత్ వ్యాపారం చేయ‌డానికి దారి తీసిన ప‌రిస్థితులేంటీ? వారిద్ద‌రి చేసిన‌ బిజినెస్ స‌క్సెస్ అయిందా? చిత్ర నందును మ‌ళ్లీ కలుసుకొందా? ప‌్రశాంత్, చిత్ర ఒక‌రిపై మ‌రొక‌రు ఇష్టాన్ని పెంచుకోవ‌డానికి దారి తీసిన ప‌రిస్థితులేంటీ అనే ప్ర‌శ్నల‌కు స‌మాధానం తెర‌మీద వెతుక్కోవాల్సిందే.
ప్ర‌శాంత్‌గా విజ‌య్ న‌ట‌న బాగుంది. చ‌క్క‌టి మెచ్యూరిటీ క‌నిపించింది. ప‌రిశ్ర‌మ‌లో సెటిల్ అవ్వ‌డానికి ఈ చిత్రాన్ని మంచి అవ‌కాశంగా ఉప‌యోగించుకొన్నాడు. ప‌క్కింటి కుర్రాడిగా ఒప్పించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. చిత్ర‌గా రీతూవ‌ర్మ గ‌త చిత్రాల కంటే మెరుగైన ప‌రిణతిని ప్ర‌ద‌ర్శించింది. పాత్ర‌కు త‌గిన‌ట్టుగా ఎమోష‌న్స్ ప‌లికించ‌డంలో వంద‌శాతం త‌నవంతు పాత్ర‌ను పోషించింది. నందు అంత‌గా గుర్తుండి పోయే పాత్రేమీ కాదు. హీరో ఫ్రెండ్స్ ఇద్ద‌రు చిత్రానికి అద‌న‌పు ఎసెట్.
టెక్నికల్ అంశాలు: ఈ చిత్రానికి ప‌నిచేసిన వాళ్లంతా ఇంత‌కు ముందు గొప్ప చిత్రాల‌కు ప‌నిచేసిన వారు కాదు. పేరున్న వారు కాదు. షార్ట్‌ఫిల్మ్స్ చేసిన అనుభ‌వం ఉన్న‌వారే. పెద్ద‌గా పాట‌లు లేక‌పోయినా వివేక్ సాగ‌ర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బ్ర‌హ్మండంగా ఉంది. కెమెరా ప‌నితీరు, ఎడిటింగ్‌, ఇత‌ర శాఖ‌ల ప‌నితీరు ఈ చిత్రాన్ని ఫీల్‌గుడ్ చిత్రంగా నిల‌పడంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాయి. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగున్నాయి. ద‌ర్శ‌కుడి ప‌నితీరు ముఖ్యంగా ఈ చిత్ర విజ‌య‌మంతా కేవ‌లం డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్‌కే ద‌క్కుతుంది. కథ‌, క‌థ‌నం ప్రేక్ష‌కుడికి మంచి ఫీలింగ్ క‌లుగ‌జేస్తాయి. పాత్ర‌ల ఎంపిక‌లోనూ, హీరో, హీరోయిన్ల క్యారెక్ట‌రైజేష‌న్‌లోనూ అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడిగా రాణించాడు. పెళ్లిచూపులును ఓ మంచి చిత్రంగా రూపొందించ‌డానికి ప‌డిన త‌ప‌న ప్ర‌తీ ఫ్రేమ్‌లోనూ క‌నిపిస్తుంది. ఈ చిత్రంలో హైద‌రాబాదీ యాసను వాడుకోవాల‌నుకోవ‌డంలోనే ద‌ర్శ‌కుడు స‌గం విజ‌యాన్ని సాధించాడు. ఎక్క‌డ లోటుపాట్లు క‌నిపించ‌కుండా హైద‌రాబాదీ యాసను ప్రేక్ష‌కులు ఆస్వాదించేలా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అభినంద‌నీయం. అప్పుడేప్పుడో వ‌చ్చిన హైద‌రాబాద్ బ్లూస్‌.. మొన్నీమ‌ధ్య వ‌చ్చిన ఆనంద్ చిత్రాల‌ను అనుక్ష‌ణం గుర్తు చేస్తుంది. ఏదిఏమైనా కుటుంబ స‌మేతంగా చూసి ఆనందించ‌ద‌గిన, టైటిల్‌కు త‌గిన‌ట్టుగానే ఓ చ‌క్క‌టి తెలుగు చిత్రం పెళ్లిచూపులు.
– రాజన్న
Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News