లీకేజీలో ప్రభుత్వ కీలక నేత హస్తముంది

తెలంగాణ ఎంసెట్‌ పేపర్ లీకేజ్ వెనుక కేసీఆర్ కుటుంబసభ్యుల హస్తముందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంలోని ఒక కీలక నేత ప్రమేయంతోనే కుంభకోణం జరిగిందన్నారు. ఇంటర్‌ బోర్డు నిషేధించిన సంస్థలకు కాంట్రాక్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. టీసీఎస్ లాంటి సంస్థల విజ్జప్తిని కూడా పక్కనపెట్టి టెండర్లు పిలవకుండా ఒక సంస్థకు నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టు కట్టబెట్టడం వల్లే పేపర్ లీక్ అయిందన్నారు. సదరు కాంట్రాక్టర్లు ప్రభుత్వంలోని ఒక ముఖ్యనేతకు బంధువని రేవంత్ ఆరోపించారు. ఇంతకుముందు […]

Advertisement
Update:2016-07-28 10:17 IST

తెలంగాణ ఎంసెట్‌ పేపర్ లీకేజ్ వెనుక కేసీఆర్ కుటుంబసభ్యుల హస్తముందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంలోని ఒక కీలక నేత ప్రమేయంతోనే కుంభకోణం జరిగిందన్నారు. ఇంటర్‌ బోర్డు నిషేధించిన సంస్థలకు కాంట్రాక్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. టీసీఎస్ లాంటి సంస్థల విజ్జప్తిని కూడా పక్కనపెట్టి టెండర్లు పిలవకుండా ఒక సంస్థకు నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టు కట్టబెట్టడం వల్లే పేపర్ లీక్ అయిందన్నారు. సదరు కాంట్రాక్టర్లు ప్రభుత్వంలోని ఒక ముఖ్యనేతకు బంధువని రేవంత్ ఆరోపించారు. ఇంతకుముందు ఇంటర్ బోర్డు హాల్ టిక్కెట్‌ల కాంట్రాక్టు పొంది ఆపనిలో విఫలం అయిన సంస్థకే ఇప్పుడు కాంట్రాక్టు అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సీఐడీ ద్వారా తూతూమంత్రంగా దర్యాప్తు చేయించి బయటపడేందుకు అసలు దోషులు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఐదారుగురు దళారులను జైలుకు పంపి చేతులు దులుపుకోవాలని చూస్తూ ఊరుకోబోమన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News