జోలపాట...పాపలనే కాదు...తాతలనూ నిద్రపుచ్చుతుంది!
జోలపాటలు, లాలిపాటలు చిన్నారులను నిద్రపుచ్చుతాయి. అయితే కమ్మని పాటలు పిల్లలనే కాదు, పెద్దవాళ్లనూ నిద్రపుచ్చుతాయంటున్నారు చెన్నైలోని ఒక అధ్యయన నిర్వాహకులు. వృద్ధుల్లో నిద్రకు ముందు విన్న సంగీతం…వారి నిద్రపై ఎలాంటి ప్రభావం చూపుతుంది…అనే విషయం మీద.. చెన్నైలోని శ్రీబాలాజీ నర్సింగ్ కాలేజి ప్రిన్స్‌పాల్ వి. హేమవతి, ఆమె పోస్టుగ్రాడ్యుయేట్ నర్సింగ్ విద్యార్థి కె ముతామిజ్ సెల్వన్ అధ్యయనాన్ని నిర్వహించారు. ఒక ఓల్డేజి హోములోని 30 మంది పెద్దవారిని ఇందుకు ఎంపిక చేసుకున్నారు. వారికి నిద్రకు ముందు సంగీతం […]
జోలపాటలు, లాలిపాటలు చిన్నారులను నిద్రపుచ్చుతాయి. అయితే కమ్మని పాటలు పిల్లలనే కాదు, పెద్దవాళ్లనూ నిద్రపుచ్చుతాయంటున్నారు చెన్నైలోని ఒక అధ్యయన నిర్వాహకులు. వృద్ధుల్లో నిద్రకు ముందు విన్న సంగీతం…వారి నిద్రపై ఎలాంటి ప్రభావం చూపుతుంది…అనే విషయం మీద.. చెన్నైలోని శ్రీబాలాజీ నర్సింగ్ కాలేజి ప్రిన్స్‌పాల్ వి. హేమవతి, ఆమె పోస్టుగ్రాడ్యుయేట్ నర్సింగ్ విద్యార్థి కె ముతామిజ్ సెల్వన్ అధ్యయనాన్ని నిర్వహించారు. ఒక ఓల్డేజి హోములోని 30 మంది పెద్దవారిని ఇందుకు ఎంపిక చేసుకున్నారు. వారికి నిద్రకు ముందు సంగీతం వినిపించగా.. వారిలో 40శాతం కంటే ఎక్కువ మందికి గాఢమైన, ప్రశాంతమైన నిద్ర పట్టినట్టుగా గమనించారు.
పిల్లలను నిద్రపుచ్చే లాలిపాటలు పెద్దవాళ్లలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి… అనే విషయంమీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వయసు పెరుగుతున్న కొద్దీ సాధారణంగా నిద్ర తగ్గుతుంటుంది. రాత్రిళ్లు తరచుగా మెలకువ వస్తుంటుంది. అంతేకాదు, చీమ చిటుక్కుమన్నా మేల్కొంటారు కొంతమంది పెద్దవాళ్లు. ఆరోగ్యంగా ఉన్న 70 ఏళ్లు దాటిన వ్యక్తి రాత్రి నిద్రిస్తున్న సమయంలో నాలుగుసార్లు మేలుకునే అవకాశం ఉందని వృద్ధుల వైద్యనిపుణులు డాక్డర్ వి ఎస్ నటరాజన్ అంటున్నారు. ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోవటం అవసరమని, అత్యవసరమైతే తప్ప తాను స్లీపింగ్ పిల్స్ వాడమని చెప్పనని…ఆయన చెబుతున్నారు. నిద్రకుముందు సంగీతాన్ని వినటం వలన స్ట్రెస్ హార్మోన్ నోరాడ్రెనలిన్ తగ్గుతుందని, తద్వారా నిద్రలో కూడా అప్రమత్తంగా ఉండే గుణం, మేల్కొనడం తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మృదువుగా, సున్నితంగా ఉండే పాటలను ఎవరి అభిరుచికి తగినట్టుగా వారు ఎంపిక చేసుకోవచ్చు. అయితే సంగీతం వినడానికి ఇయర్ ఫోన్స్ మాత్రం వాడకూడదని, నిద్రలోకి జారుకుంటున్నపుడు పాటలను ఆపేయాలని నిద్ర సంబంధిత వైద్య నిపుణులు డాక్టర్ ఎన్. రామకృష్ణన్ సలహా ఇస్తున్నారు.