పవన్-త్రివిక్రమ్ కాంబోలో 2 సినిమాలు

త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం… పవన్ కోసం త్రివిక్రమ్ ఏకంగా 2 కథలు సిద్ధం చేశాడట. అయితే వీటిలోంచి ఒక కథను మాత్రమే పవన్ తన కోసం సెలక్ట్ చేసుకున్నాడు. మరో కథను తన అన్నయ్య కొడుకు రామ్ చరణ్ కోసం అట్టిపెట్టాడని తెలుస్తోంది. అంటే… త్రివిక్రమ్ తోనే హీరోగా ఓ సినిమాను, ఆ వెంటనే త్రివిక్రమ్ తోనే తను నిర్మాతగా […]

Advertisement
Update:2016-07-27 08:51 IST

త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం… పవన్ కోసం త్రివిక్రమ్ ఏకంగా 2 కథలు సిద్ధం చేశాడట. అయితే వీటిలోంచి ఒక కథను మాత్రమే పవన్ తన కోసం సెలక్ట్ చేసుకున్నాడు. మరో కథను తన అన్నయ్య కొడుకు రామ్ చరణ్ కోసం అట్టిపెట్టాడని తెలుస్తోంది. అంటే… త్రివిక్రమ్ తోనే హీరోగా ఓ సినిమాను, ఆ వెంటనే త్రివిక్రమ్ తోనే తను నిర్మాతగా చెర్రీ హీరోగా ఇంకో సినిమాను బ్యాక్ టు బ్యాక్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడట.

ప్రస్తుతం పవన్ కడప కింగ్ అనే ప్రాజెక్ట్ పనిమీద ఉన్నాడు. గోపాల గోపాల దర్శకుడు డాలీ ఈ సినిమాను డైరక్ట్ చేయబోతున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా వచ్చే వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఈ ఏడాది చివరిలోగా ఈ సినిమాను కంప్లీట్ చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను పట్టాలపైకి తీసుకురావాలనుకుంటున్నాడు పవన్. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే…. వచ్చే ఏడాది జులై నుంచి తను నిర్మాతగా చెర్రీ హీరోగా సినిమా చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడు.

మరో 3 ఏళ్లలో సినిమాల నుంచి తప్పుకుంటానని పవన్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ టైమ్ లోనే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నట్టు ప్రకటించాడు. పైగా రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తానని గతంలోనే మాటిచ్చాడు కాబట్టి ఆ ప్రాజెక్టు కూడా చేయాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News