శ్రీకాంత్ తనయుడి కోసం గొంతు విప్పిన నాగార్జున..!
హీరో శ్రీకాంత్ తనయుడు పరిచయం అవుతున్న “నిర్మలా కాన్వెంట్” సినిమాను అన్నపూర్ణ బ్యానర్ లో నాగార్జున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నాగార్జున ఒక పాట కూడా పాడటం విశేషం. ‘కొత్త కొత్త భాష… కొత్త ప్రేమ భాష’ అంటూ నాగార్జున ఓ పాట పాడారు.ఈ చిత్రంలో నాగ్ ఓ పాత్రలోనూ కనిపించనున్నారు. ఇప్పుడు ఓ పాట పాడి… ఈ చిత్రానికి సరికొత్త హంగులద్దారు. రోషన్ సాలూరి స్వరపరిచిన ఈ గీతాన్ని అనంత […]
Advertisement
హీరో శ్రీకాంత్ తనయుడు పరిచయం అవుతున్న “నిర్మలా కాన్వెంట్” సినిమాను అన్నపూర్ణ బ్యానర్ లో నాగార్జున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నాగార్జున ఒక పాట కూడా పాడటం విశేషం. ‘కొత్త కొత్త భాష… కొత్త ప్రేమ భాష’ అంటూ నాగార్జున ఓ పాట పాడారు.ఈ చిత్రంలో నాగ్ ఓ పాత్రలోనూ కనిపించనున్నారు. ఇప్పుడు ఓ పాట పాడి… ఈ చిత్రానికి సరికొత్త హంగులద్దారు.
రోషన్ సాలూరి స్వరపరిచిన ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రచించారు. ఈ పాటని ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ‘నిర్మలా కాన్వెంట్’ని త్వరలోనే విడుదల చేయనున్నారు. గతంలో నాగార్జున సీతారామరాజు చిత్రంలో సిగరెట్ మీద ఒక పాటను సరదగా పాడారు. ఆ తరువాత ఆయన గొంతు సవరించుకోవడం ఇదే .
Advertisement