ఫిల్మ్‌నగర్‌లో కూలిన భవనం

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు రోజూవారి కూలీలు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని దగ్గరలో వున్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిని మంత్రులు నాయిని, తలసాని, మేయర్‌ రామ్మెహన్‌, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు సందర్శించారు. భవన నిర్మాణ కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే విష్ణు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ యువజన కార్యకర్తలు ఎఫ్‌ఎన్‌సీసీపై దాడిచేసి, అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం […]

Advertisement
Update:2016-07-24 09:32 IST

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు రోజూవారి కూలీలు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని దగ్గరలో వున్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిని మంత్రులు నాయిని, తలసాని, మేయర్‌ రామ్మెహన్‌, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు సందర్శించారు. భవన నిర్మాణ కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే విష్ణు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ యువజన కార్యకర్తలు ఎఫ్‌ఎన్‌సీసీపై దాడిచేసి, అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. నాణ్యతా లోపం వల్లే భవనం కూలినట్టు భావిస్తున్నారు.భవన నిర్మాణానికి ఉపయోగించిన ఇసుక, సిమెంట్‌ మిశ్రమాన్ని ఫోరెన్సిక్‌ అధికారులు సేకరించారు. బాధితులపై కటినచర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. మృతులకు 2 లక్షలు ఎక్స్‌గ్రెషియా జీహెచ్‌ఎంసీ ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News