కాజల్ కూడా చిరంజీవికి నో చెప్పేసిందా...

హీరోయిన్లంతా చిరంజీవికి వరుసపెట్టి హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. నయనతారతో మొదలుపెట్టి దీపికా పదుకోన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అనుష్క… ఇలా చాలామంది పేర్లు 150వ సినిమాకు సంబంధించి వినిపించాయి. తాజాగా ఈ జాబితాలోకి కాజల్ కూడా చేరిపోయింది. ఇప్పటికే చిరు తనయుడు రామ్ చరణ్ సరసన,చిరు తమ్ముడు పవన్ కల్యాణ్ సరసన మెరిసిన కాజల్ ను… చిరంజీవి కూడా తన సినిమాలోకి తీసుకోవాలని అనుకున్నాడట. ఆమె కాల్షీట్లు కూడా ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి ఈజీగానే కాజల్ ను ఒప్పించవచ్చని […]

Advertisement
Update:2016-07-22 16:42 IST

హీరోయిన్లంతా చిరంజీవికి వరుసపెట్టి హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. నయనతారతో మొదలుపెట్టి దీపికా పదుకోన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అనుష్క… ఇలా చాలామంది పేర్లు 150వ సినిమాకు సంబంధించి వినిపించాయి. తాజాగా ఈ జాబితాలోకి కాజల్ కూడా చేరిపోయింది. ఇప్పటికే చిరు తనయుడు రామ్ చరణ్ సరసన,చిరు తమ్ముడు పవన్ కల్యాణ్ సరసన మెరిసిన కాజల్ ను… చిరంజీవి కూడా తన సినిమాలోకి తీసుకోవాలని అనుకున్నాడట. ఆమె కాల్షీట్లు కూడా ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి ఈజీగానే కాజల్ ను ఒప్పించవచ్చని అంతా అనుకున్నారు. కానీ కాజల్ మాత్రం చిరు యూనిట్ కు తిరుగులేని షాక్ ఇచ్చింది. బాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో పారితోషికం డిమాండ్ చేసిందట.

గతంలో నయనతార, మొన్నటికిమొన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి తారలు భారీగా డిమాండ్ చేయడంతోనే వాళ్లను ప్రాజెక్టు నుంచి తప్పించారు. తాజాగా కాజల్ ను సంప్రదిస్తే… ఆమె కూడా రెండున్నర కోట్ల రూపాయలు కావాలని అడిగిందట. మెగాస్టార్ సరసన ఛాన్స్ అని తెలిసి కూడా కాజల్ ఇంత డిమాండ్ చేయడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. దీంతో గత్యంతరం లేక కాజల్ ను కూడా వదిలేసుకున్నారట. సో… చిరంజీవి హీరోయిన్ వేట మళ్లీ మొదటికి వచ్చిందనే చెప్పాలి.

Tags:    
Advertisement

Similar News