"కబాలి" సినిమా రివ్యూ
టైటిల్ : “కబాలి” సినిమా రివ్యూ రేటింగ్: 2.75 తారాగణం : రజనీకాంత్, రాధికా ఆప్టే తదితరులు సంగీతం : సంతోష్ నారాయణ్ దర్శకత్వం : పా రంజిత్ కొచ్చడియాన్, లింగా ఘోర పరాజయాల తర్వాత దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కబాలి. ఫస్ట్‌లుక్, టీజర్ అందించిన జోష్‌తో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలకు ముందు నెలకొన్న భారీ అంచనాలను ఈ చిత్రం చేరుకొందా అనే విషయాన్ని తెలుసుకోవాంలంటే […]
Advertisement
టైటిల్ : “కబాలి” సినిమా రివ్యూ
రేటింగ్: 2.75
తారాగణం : రజనీకాంత్, రాధికా ఆప్టే తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణ్
దర్శకత్వం : పా రంజిత్
రేటింగ్: 2.75
తారాగణం : రజనీకాంత్, రాధికా ఆప్టే తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణ్
దర్శకత్వం : పా రంజిత్
కొచ్చడియాన్, లింగా ఘోర పరాజయాల తర్వాత దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కబాలి. ఫస్ట్‌లుక్, టీజర్ అందించిన జోష్‌తో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలకు ముందు నెలకొన్న భారీ అంచనాలను ఈ చిత్రం చేరుకొందా అనే విషయాన్ని తెలుసుకోవాంలంటే కథ ఏమిటో తెలుసుకోవాల్సిందే.
కథ..
మలేషియాకు బతుకు తెరువు కోసం వెళ్లిన భారతీయ కుటుంబానికి చెందిన కబాలిశ్వరన్ అలియాస్ కబాలీ (రజనీకాంత్) అనుకొని పరిస్థితుల్లో డాన్‌గా మారుతాడు. అన్యాయానికి గురవుతున్న భారతీయ సమాజానికి నేతగా ఎదుగుతాడు. మలేషియాలో డ్రగ్స్, మానవ అక్రమ రవాణ తదితర దందాలను నడిపే మరో వర్గాన్ని ఎదుర్కోవడానికి తనకంటూ ఓ గ్రూప్‌ను ఏర్పరుచుకొంటాడు. ఆ క్రమంలో వల్లీ (రాధిక ఆప్టే)తో ప్రేమలో పడుతాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకొంటాడు. రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరులో కబాలీపై ప్రత్యర్థివర్గం అక్రమ కేసులు బనాయించి 25 ఏండ్లు జైల్లో పెడుతారు. కబాలి జైలుకు వెళ్లే సమయానికి గర్భంతో ఉన్న వల్లి ప్రత్యర్థివర్గం దాడి చేయడంతో ఆమె చావు బతుకుల మధ్య ఉంటుంది. 25 ఏండ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన కబాలి పరిస్థితి ఏమిటీ? ప‌్రత్యర్థులను ఎలా ఎదుర్కొన్నాడు. చావు బతుకుల మధ్య వదిలేసిన భార్య వల్లి పరిస్థితి ఏమిటీ? వల్లిని మళ్లీ కలుసుకొన్నాడా అనే ప్రశ్నలకు సమాధానమే కబాలి చిత్రకథ.
నటీ నటులు
రజనీ యాక్టింగ్ గురించి, స్టైల్ గురించి కొత్తగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీలేదు. నడక, స్టైల్, హావభావాలతో ఎప్పటిలానే అదరగొట్టాడు. సెంటిమెంట్ సీన్లలో భావోద్వేగాన్ని పండించాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో యుక్తవయస్సులో కనిపించిన కొన్ని సీన్లలో నైనా అదరగొట్టాడు. ఈ చిత్రంలో తన పాత్ర పరిధి మేరకు ఆయనను తప్పుపట్టాల్సిన పనే ఉండదు. వల్లీ పాత్రలో రాధిక ఆప్టే తన పరిధి మేరకు పర్వాలేదనిపించింది. తన కూతురు యోగి పాత్రలో కనిపించిన ధన్సిక కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. విలన్ పాత్రలో కనపించిన విన్‌స్టన్ చావో, కిషోర్, జాన్ విజయ్‌లు పర్వాలేదనిపించారు.
విశ్లేషణ:
మలేషియాలో భారతీయులు పడుతున్న పాట్లను కథాంశంగా తీసుకొని కబాలిగా తెరకెక్కించడం అభినందనీయం. కానీ కథకు తగినట్టు కథనం లేకపోవడం, సన్నివేశాలు పేలవంగా ఉండటం అభిమానులను కొంత నిరాశకు గురిచేస్తాయి. అంతేకాకుండా రజనీ సినిమాకు డైలాగ్సే బలం. ఒకటి అరా డైలాగ్స్ తప్ప సినిమాలో అరిచి, ఈలలు వేసే పరిస్థితే కనిపించదు. సంభాషణలు కూడా తెలుగు నేటివిటీకి దూరంగా ఉన్నట్టు కనిపిస్తాయి. సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం బాగుంది. మలేషియా, థాయ్‌లాండ్ అందాలు, గ్యాంగ్స్టర్ సన్నివేశాలను తెరక్కెక్కించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఓవరాల్‌గా కెమెరా పనితీరు భేష్ అనేలా ఉంది. ఇక రజనీ ఇమేజ్, స్టైలుకు తగినట్టు కథనం, సంభాషణలు రూపొందించకపోవడమనే విషయంలో దర్శకుడు పా రంజిత్‌నే తప్పుపట్టాల్సి ఉంటుంది. మంచి కథను నడిపించడంలో దర్శకుడు బోల్తా పడ్డాడనే చెప్పవచ్చు. దర్శకుడు విఫలమైనా రజనీ ఈ చిత్ర భారాన్ని అంతా తన మీద వేసుకొని నడిపించాడు. చిత్ర ప్రథమార్థంలో కొంత, ద్వితీయార్థంలో బాగా నత్తనడకగా సాగి.. ఓ దశలో ప్రేక్షకుడిని విసిగించేలా ఉంటాయి. చివరగా సంచలనాలు, భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కబాలి అభిమానులను, సగటు సినీ ప్రేక్షకుడిని కచ్చితంగా నిరుత్సాహానికి గురిచేస్తాయి. సెంటిమెంట్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కొంత మేర ఇష్టపడే అంశాలు ఉన్నాయి.
ఫైనల్ జడ్జిమెంట్:
బాషా, చంద్రముఖి, రోబో లాంటి సూపర్ హిట్ కాదు..
లింగా, కొచ్చడయాన్ లాంటి చెత్త సినిమా కాదు..
బలం
రజనీకాంత్.. రజనీకాంత్.. రజనీకాంత్
కెమెరా, మ్యూజిక్
బలహీనత
సంభాషణలు, కథనం, దర్శకత్వం
– రాజన్న
Advertisement