వామ్మో.... విడుదలకు ముందే రూ.60 కోట్లు...

మన హీరోలంతా ఇప్పుడు ఏటీఎంల్లా తయారయ్యారు. పిండుకున్నోళ్లకు పిండుకున్నంత అన్నట్టు తయారయ్యారు. సినిమా విడుదలయ్యాక హిట్ అవుతుందా.. ఫట్ అవుతుందా అనే విషయంతో సంబంధం లేకుండా… సెట్స్ పై ఉంటుండగానే స్టార్ హీరోల సినిమాలు కోట్లు కొల్లగొడుతున్నాయి. మొన్నటికి మొన్న కబాలి సినిమా విడుదలకు ముందే 90కోట్ల రూపాయల బిజినెస్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు సూర్య కూడా ప్రీ-రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. తన కెరీర్ లోనే బెస్ట్ ఫిగర్స్ నమోదు […]

Advertisement
Update:2016-07-17 09:02 IST

మన హీరోలంతా ఇప్పుడు ఏటీఎంల్లా తయారయ్యారు. పిండుకున్నోళ్లకు పిండుకున్నంత అన్నట్టు తయారయ్యారు. సినిమా విడుదలయ్యాక హిట్ అవుతుందా.. ఫట్ అవుతుందా అనే విషయంతో సంబంధం లేకుండా… సెట్స్ పై ఉంటుండగానే స్టార్ హీరోల సినిమాలు కోట్లు కొల్లగొడుతున్నాయి. మొన్నటికి మొన్న కబాలి సినిమా విడుదలకు ముందే 90కోట్ల రూపాయల బిజినెస్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు సూర్య కూడా ప్రీ-రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. తన కెరీర్ లోనే బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు.

ప్రస్తుతం హరి దర్శకత్వంలో సింగం-3 సినిమా చేస్తున్నాడు సూర్య. ఈ సినిమా తమిళ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. సౌత్ తమిళనాడుకు చెందిన ఓ బడా డిస్ట్రిబ్యూటర్ సూర్య నటిస్తున్న సింగం-3 హక్కుల్ని ఏకంగా 41 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నాడు. ఉదయం ఎంటర్ టైన్ మెంట్స్ ఈ హక్కుల్ని రికార్డు ధరకు దక్కించుకోవడంతో కోలీవుడ్ అవాక్కయింది. సూర్య సినిమాకు ఇప్పటివరకు ఇంత రేటు ఎప్పుడూ రాలేదు. సింగం-3 ప్రాజెక్టుపై ఎంత క్రేజ్ ఉందో దీన్ని బట్టి అర్థంచేసుకోవచ్చు. ఇటు తెలుగులో కూడా ఈ సినిమా ఇప్పటికే 19 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. టాలీవుడ్ లో మల్కాపురం శివకుమార్ అనే డిస్ట్రిబ్యూటర్ ఈ రైట్స్ దక్కించుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే విడుదలకు ముందే సూర్య సినిమా 60కోట్ల రూపాయలు వసూలు చేసింది. వీటికి శాటిలైట్ రైట్స్, ఆడియో హక్కులు కూడా కలుపుకుంటే లెక్క ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అలా విడుదలకు ముందే సింగం-3 సినిమాతో సంచలనాలు సృష్టిస్తోంది.

Tags:    
Advertisement

Similar News