అసద్‌ని అరెస్టు చేయండి!
ఎంఐఎం అధినేత, ఎంపీ అసద్ కు మరో భారీ షాక్ తగిలింది. తాను చేసిన ప్రసంగం వల్ల మరోసారి ఆయన అరెస్టుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు కుట్రపన్నారన్న కారణంతో పాతబస్తీకిచెందిన కొందరు యువకులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే! ఎన్ ఐ ఏ అదుపులోకి తీసుకున్న యువకులందరికీ న్యాయసాయం అందిస్తామని అసద్ బహిరంగంగా ప్రకటించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. హైదరాబాద్‌కు చెందిన […]
Advertisement
ఎంఐఎం అధినేత, ఎంపీ అసద్ కు మరో భారీ షాక్ తగిలింది. తాను చేసిన ప్రసంగం వల్ల మరోసారి ఆయన అరెస్టుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు కుట్రపన్నారన్న కారణంతో పాతబస్తీకిచెందిన కొందరు యువకులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే! ఎన్ ఐ ఏ అదుపులోకి తీసుకున్న యువకులందరికీ న్యాయసాయం అందిస్తామని అసద్ బహిరంగంగా ప్రకటించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. హైదరాబాద్‌కు చెందిన కరుణాసాగర్ అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దేశంలో విధ్వంసం సృష్టించాలనుకున్న ఉగ్రవాద సానుభూతి పరులకు న్యాయ సాయం అందిస్తాననడం చట్టరీత్యా నేరమేనని వాదించారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన 11వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎంపీ అసద్‌ను అరెస్టు చేయాలంటూ సరూర్ నగర్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలు కావడంతో అసద్ అరెస్టు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది.
పేలుళ్ల నిందితులకు న్యాయసాయం అందిస్తానన్న ఒవైసీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బీజేపీనేతలైతే.. ఎంఐఎం ఇలా ఉగ్రవాదులకు బహిరంగ మద్దతు పలకడం ఏంటని నిలదీశారు. అసద్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు కూడా! ఈ విషయం జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీసింది. అయితే, తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని అసద్ సమర్థించుకున్నారు. వాళ్లు నిందితులే కానీ నేరస్తులుగా నిరూపణ కాలేదని, నిందితులకు న్యాయసాయం అంధించడంలో తప్పులేదని అన్నారు. గతంలో ఇలా పలువురు ముస్లిములను వివిధ దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసిన సమయంలో వారిలో చాలామంది నిరపరాధులుగా విడుదలైన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. మొత్తానికి అసద్ మరోసారి కోర్టు గడప తొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Advertisement