కడప నేల జోలికొస్తే రక్తపాతమే " రామచంద్రయ్య
కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య .. చంద్రబాబుకు గట్టి హెచ్చరికే చేశారు. రాజధాని కోసం సీఆర్‌డీఏ పరిధిలోని దాదాపు 40 వేల ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేయాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. అందు కోసం అటవీ చట్టాలను అనుసరించి అంతే భూమిని కడప జిల్లాలో అటవీ శాఖకు కేటాయిస్తామని సీఎం చెప్పారు. ఈ నిర్ణయంపై కడప జిల్లాకే చెందిన సి. రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో భూములకు ప్రతిఫలంగా కడప జిల్లా భూములను ఇవ్వచూస్తే […]
కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య .. చంద్రబాబుకు గట్టి హెచ్చరికే చేశారు. రాజధాని కోసం సీఆర్‌డీఏ పరిధిలోని దాదాపు 40 వేల ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేయాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. అందు కోసం అటవీ చట్టాలను అనుసరించి అంతే భూమిని కడప జిల్లాలో అటవీ శాఖకు కేటాయిస్తామని సీఎం చెప్పారు. ఈ నిర్ణయంపై కడప జిల్లాకే చెందిన సి. రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో భూములకు ప్రతిఫలంగా కడప జిల్లా భూములను ఇవ్వచూస్తే అక్కడ రక్తపాతం జరుగుతుందని సి. రామచంద్రయ్య హెచ్చరించారు.
కేంద్రం ఇచ్చిన వెనుకబడిన జిల్లాల నిధులు 700కోట్లలో కేవలం ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేశారని , మిగిలిన సొమ్మును చంద్రబాబు యాత్రలకు ఖర్చుపెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పరిపాలన సాగుతోందని అన్నారు. అవినీతిలో ఏపీది ప్రథమ స్థానం అని అందుకే ఇక్కడికి పెట్టుబడులు రావడం లేదని రామచంద్రయ్య చెప్పారు. చంద్రబాబు విదేశీ పర్యటనలు చేసినంత మాత్రాన పెట్టుబడులు రావని అన్నారు. ప్రత్యేక హోదా తప్ప రాష్ట్రానికి మరో మార్గం లేదని ఆయన చెప్పారు.
Click on Image to Read: