మళ్లీ అదే తప్పు..!
సినిమా కథ రాయడం అంటే స్పూఫ్ లు రాసుకోవడమేనా. హస్య ప్రధానంగా రచయితలు కథల్ని తీర్చి దిద్దలేరా..? అసలు అటువంటి రచయితలు మన తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం లేనేట్టా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే అల్లరి నరేష్ మంచి నటుడు. నట కీరటి రాజేంద్ర ప్రసాద్ తరువాత హస్య చిత్రాలకు ఆయనే కేరాఫ్ అయ్యారు. కానీ.. ఈ స్థాయికి తగ్గ కథలు మాత్రం రావడం లేదు. అల్లరి నరేష్ అంటే ఆడియన్స్ కామెడి ఆశిస్తారు కాబట్టి..ఏదో ఒకటి […]
సినిమా కథ రాయడం అంటే స్పూఫ్ లు రాసుకోవడమేనా. హస్య ప్రధానంగా రచయితలు కథల్ని తీర్చి దిద్దలేరా..? అసలు అటువంటి రచయితలు మన తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం లేనేట్టా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే అల్లరి నరేష్ మంచి నటుడు. నట కీరటి రాజేంద్ర ప్రసాద్ తరువాత హస్య చిత్రాలకు ఆయనే కేరాఫ్ అయ్యారు. కానీ.. ఈ స్థాయికి తగ్గ కథలు మాత్రం రావడం లేదు. అల్లరి నరేష్ అంటే ఆడియన్స్ కామెడి ఆశిస్తారు కాబట్టి..ఏదో ఒకటి చెప్పి నవ్వించేద్దాం అనే విధంగా సెల్ఫీ రాజా నుకూడా అల్లుకున్నారు.
సెల్పీల వల్ల సెలిబ్రిటీలు ఎదుర్కొనే సమస్యలు.. ఇబ్బందులు.. దీనితో పాటు సోషల్ నెట్ వర్క్ వలన ఇప్పటి యువత ఫేస్ చేస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ తమ చిత్రంలో ప్రధానంగా చెప్పారు. కానీ.. అదేమి జరగలేదు. ఏదో కొద్ది భాగం చూపించి.. మిగిలిదంతా..సుడిగాడు చిత్రంలో స్పూఫ్ ల మాదిరి చేసేశారు. ఏదో విదంగా ఆడియన్స్ ను నవ్విద్దాం అనే ధోరణే కథనంలో కనిపించింది తప్ప.. కథనం పరంగా సందర్బోచితంగా హస్యం పుట్టించ లేక పోయారు. ఓవరాల్ గా నవ్వించారు కానీ.. అది కేవలం దర్శకుడి ప్రతిభ గా చెప్పడానికి లేదు. జబర్ధస్త్ కామెడి మాదిరి చేసి మమా అనిపించారు.