అరె... సుమంత్ కూడా ప్రేమలో పడ్డాడు...

ఇప్పటికే నాగచైతన్య లవ్ ఎఫైర్ పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది. హీరోయిన్ సమంతతో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాడు చైతూ. మరోవైపు చైతూ తమ్ముడు అఖిల్ కూడా తానేం తీసుపోనంటూ రూమర్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. తన కుటంబానికి దగ్గరగా ఉన్న మరో ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడట. వీళ్లిద్దరి ప్రేమ కబుర్లు రోజుకో రూమర్ తో హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా… ఇప్పుడు అక్కినేని కాంపౌండ్ నుంచి ముచ్చటగా మరో […]

Advertisement
Update:2016-07-13 10:16 IST
అరె... సుమంత్ కూడా ప్రేమలో పడ్డాడు...
  • whatsapp icon
ఇప్పటికే నాగచైతన్య లవ్ ఎఫైర్ పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది. హీరోయిన్ సమంతతో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాడు చైతూ. మరోవైపు చైతూ తమ్ముడు అఖిల్ కూడా తానేం తీసుపోనంటూ రూమర్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. తన కుటంబానికి దగ్గరగా ఉన్న మరో ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడట. వీళ్లిద్దరి ప్రేమ కబుర్లు రోజుకో రూమర్ తో హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా… ఇప్పుడు అక్కినేని కాంపౌండ్ నుంచి ముచ్చటగా మరో వ్యక్తి కూడా ప్రేమలో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. హీరో సుమంత్ ఓ హీరోయిన్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.
గతంలో సుమంత్ హీరోగా నటించిన బోణి సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అయింది కృతి కర్బందా. తర్వాత పవన్ నటించిన తీన్ మార్ సినిమాతో మరోసారి అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. తాజాగా చెర్రీ చేసిన బ్రూస్ లీ సినిమాలో చరణ్ కు అక్కగా నటించింది. ఈమెతోనే సుమంత్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్ని కృతి ఖండిస్తోంది. సుమంత్ తనకు ఆప్తమిత్రుడు మాత్రమేనని, తన కెరీర్ ను చక్కదిద్దే మెంటర్ మాత్రమేనని అంటోంది.
చైతూ, అఖిల్ లా సుమంత్ బ్యాచిలర్ కాదు. అతడికి ఇప్పటికే పెళ్లయింది పవన్ తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తిరెడ్డి గుర్తుందా… ఆమెనే సుమంత్ భార్య. అయితే ఇప్పుడు కాదు. ఒకప్పుడు మాత్రమే వీళ్లు భార్యాభర్తలు. ప్రస్తుతం సుమంత్ సింగిల్ గానే ఉంటున్నాడు. ఈ గ్యాప్ లో కృతి కర్బందా ఆయనకు దగ్గరైందనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై స్పందించడానికి సుమంత్ నిరాకరిస్తున్నాడు.
Tags:    
Advertisement

Similar News