దీపికా పదుకొనె...భారతీయ మానసిక వైద్యానికి బ్రాండ్ అంబాసిడర్!
భారతీయ మానసిక వైద్యానికి బాలివుడ్ నటి దీపికా పడుకొనె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. భారతీయ మానసిక వైద్యుల సంఘం జాతీయాధ్యక్షుడు ప్రసాదరావు ఈ విషయాన్ని తెలిపారు. శనివారం విజయవాడలో ప్రారంభమైన రెండురోజుల ఎపి సైకాన్-2016 వార్షిక సదస్సులో మాట్లాడిన ఆయన, ఈ విషయంపై దీపికతో మాట్లాడామని, ఆమె అంగీకరించారని, త్వరలో ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ఇప్పటికే దీపిక చాలా సార్లు తాను తీవ్రమైన డిప్రెషన్‌నుండి బయటపడినట్టుగా మీడియాతో చెప్పినసంగతి తెలిసిందే. 2014లో ఆమె కెరీర్ అత్యున్నత […]
భారతీయ మానసిక వైద్యానికి బాలివుడ్ నటి దీపికా పడుకొనె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. భారతీయ మానసిక వైద్యుల సంఘం జాతీయాధ్యక్షుడు ప్రసాదరావు ఈ విషయాన్ని తెలిపారు. శనివారం విజయవాడలో ప్రారంభమైన రెండురోజుల ఎపి సైకాన్-2016 వార్షిక సదస్సులో మాట్లాడిన ఆయన, ఈ విషయంపై దీపికతో మాట్లాడామని, ఆమె అంగీకరించారని, త్వరలో ప్రకటన వెలువడుతుందని చెప్పారు.
ఇప్పటికే దీపిక చాలా సార్లు తాను తీవ్రమైన డిప్రెషన్‌నుండి బయటపడినట్టుగా మీడియాతో చెప్పినసంగతి తెలిసిందే. 2014లో ఆమె కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నపుడు దీపిక మానసిక ఒత్తిడికి గురై ఒకరోజు షూటింగ్లో కళ్లు తిరిగి పడిపోయింది. అప్పుడు తనకు పెద్ద కొండమీద నుండి కింద పడిపోతున్నట్టుగా అనిపించింది. అయితే ఇదంతా నిరంతర పని, మానసిక ఒత్తిడి, అందులోంచి పుట్టిన ఆందోళనల వలన జరిగిందని దీపిక గుర్తించింది. తరువాత ఆమె తన జీవన శైలిలో అనేక మార్పులు చేసుకుంది. పని తగ్గించుకుని కుటుంబంతో ఉండటానికి ప్రాధాన్యతని ఇచ్చింది. ఎక్కువమంది మనుషుల మధ్య ఉండటం, ధ్యానం, ప్రాణాయామం లాంటివి చేయటం అలవాటు చేసుకుంది. దాంతో ఆమె తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ఒత్తిడికి గురయినపుడు శ్వాస సంబంధిత సమస్యలు, జ్ఞాపకశక్తి సమస్యలకు గురయినట్టుగా ఆమె గత ఏడాది మీడియా ముందు వెల్లడించింది.