పోలీస్ డ్రెస్ లో   వ‌రుణ్ తేజ్..! 

హీరోలకు పోలీస్ డ్రస్ వేయాలంటే భలే ఇష్టం. పోలీస్ డ్రస్ వేసి న్యాయం, ధర్మ రక్షించేయాలని తపన పడుతూంటారు. అందుకేనేమో దాదాపు మన చిన్నా, పెద్ద హీరోలందరూ పోలీస్ డ్రస్ వేసేసారు. అఢపదడపా హీరోయిన్స్ కూడా పోలీస్ డ్రస్ లో కనిపించారు. ఇప్పుడు వరుణ్ తేజ కూడా అదే రూట్ ని ఎంచుకున్నట్లు సమాచారం. శ్రీను వైట్ల, వరుణ్ తేజ కాంబినేషన్ లో రూపొందనున్న మిస్టర్ చిత్రంలో వరుణ్ తేజ పోలీస్ డ్రస్ లో కనిపించనున్నారని సమాచారం. […]

Advertisement
Update:2016-07-09 10:12 IST
హీరోలకు పోలీస్ డ్రస్ వేయాలంటే భలే ఇష్టం. పోలీస్ డ్రస్ వేసి న్యాయం, ధర్మ రక్షించేయాలని తపన పడుతూంటారు. అందుకేనేమో దాదాపు మన చిన్నా, పెద్ద హీరోలందరూ పోలీస్ డ్రస్ వేసేసారు. అఢపదడపా హీరోయిన్స్ కూడా పోలీస్ డ్రస్ లో కనిపించారు. ఇప్పుడు వరుణ్ తేజ కూడా అదే రూట్ ని ఎంచుకున్నట్లు సమాచారం. శ్రీను వైట్ల, వరుణ్ తేజ కాంబినేషన్ లో రూపొందనున్న మిస్టర్ చిత్రంలో వరుణ్ తేజ పోలీస్ డ్రస్ లో కనిపించనున్నారని సమాచారం. గతంలో శ్రీను వైట్ల దర్సకత్వంలో వచ్చిన ఆగడులో మహేష్ బాబు, బాద్షాలో ఎన్టీఆర్, బ్రూస్ లీ చిత్రంలో రామ్ చరణ్ సైతం ఖాఖీ డ్రస్ లో కనిపించారు. క్యారక్టర్ ప్రకారం వాళ్లు పోలీస్ డ్రస్ వేసి కనిపించారు.
‘ఠాగూర్’ మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ ని అందించిన శ్రీను వైట్ల తనదైన శైలిలో విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మ‌రి ఈ డ్రెస్ మ‌న వ‌రుణ్ తేజ్ కు ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుంది లెట్స్ వెయిట్ అండ్ సీ.
Tags:    
Advertisement

Similar News