మిగిలిన నూకలు మనం మింగేద్దాం

త‌మ్ముడు.. త‌మ్ముడే పేకాట పేకాటే! దేని దారి దానిదే..! ఇప్పుడు ఇదే ఫార్ములాను తెలంగాణ బీజేపీ న‌మ్ముకున్న‌ట్టుంది. టీడీపీతో పొత్తుని కొన‌సాగిస్తూనే.. అదే పార్టీలోని నేత‌ల‌ను ఆక‌ర్షించేందుకు కొత్త ఎత్తుగ‌డ‌లు వేస్తోంది బీజేపీ. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీని తెలంగాణ‌లో అధికారంలోకి తీసుకురావ‌డమే ల‌క్ష్యంగా ఆప‌రేషన్ ఆకర్ష్ 2019కి శ్రీ‌కారం చుట్టాల‌ని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం భారీగా ఇత‌ర పార్టీ నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానించాల‌ని పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా సూచించారు. అవ‌స‌ర‌మైతే మిత్ర‌ప‌క్షం […]

Advertisement
Update:2016-07-09 03:50 IST

త‌మ్ముడు.. త‌మ్ముడే పేకాట పేకాటే! దేని దారి దానిదే..! ఇప్పుడు ఇదే ఫార్ములాను తెలంగాణ బీజేపీ న‌మ్ముకున్న‌ట్టుంది. టీడీపీతో పొత్తుని కొన‌సాగిస్తూనే.. అదే పార్టీలోని నేత‌ల‌ను ఆక‌ర్షించేందుకు కొత్త ఎత్తుగ‌డ‌లు వేస్తోంది బీజేపీ. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీని తెలంగాణ‌లో అధికారంలోకి తీసుకురావ‌డమే ల‌క్ష్యంగా ఆప‌రేషన్ ఆకర్ష్ 2019కి శ్రీ‌కారం చుట్టాల‌ని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం భారీగా ఇత‌ర పార్టీ నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానించాల‌ని పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా సూచించారు. అవ‌స‌ర‌మైతే మిత్ర‌ప‌క్షం తెలుగుదేశం నుంచి నాయ‌కులు వ‌స్తామ‌న్నా.. ఎలాంటి అభ్యంత‌రం తెల‌ప‌వ‌ద్ద‌ని చెప్పార‌ని తెలిసింది.

తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాలంటే.. స్థానికంగా అంగ‌బ‌లం, అర్థ‌బలం ఉన్న‌ నాయ‌కులు అవ‌స‌రం. ఈ విష‌యంలో బీజేపీ చాలా రోజులుగా ఇబ్బందులు ప‌డుతోంది. ఉన్న‌దున్న‌ట్లుగా చెప్పాలంటే తెలంగాణ‌లో గ్రామ‌, మండ‌ల స్థాయిలో బీజేపీ కేడ‌ర్ చాలా బ‌ల‌హీనంగా ఉంది. అందుకే, టీడీపీలోని నేత‌ల‌పై బీజేపీ దృష్టి పెట్టిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం టీడీపీలో జిల్లాలు, మండ‌ల స్థాయిలో సీనియ‌ర్లు చాలామంది పార్టీ మారుతున్నారు. కొంద‌రు అధికార పార్టీ వైపు వెళితే..మ‌రికొంద‌రు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని బీజేపీ అధిష్టానం ప్లాన్ వేసింద‌ని తెలిసింది. ప్ర‌జాబ‌లం ఉన్న నేత‌లు రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం కాంగ్రెస్‌, టీఆర్ ఎస్ లోకి వెళితే వారికి ఏదోప‌ద‌వి ద‌క్కుతుంది. అదే మండ‌ల‌, గ్రామ‌స్థాయి నేత‌లు పార్టీలు మారినా.. పెద్ద‌గా ప్ర‌తిఫ‌లం ద‌క్క‌దు. అందుకే, ఇలాంటి నేత‌ల‌పై ముఖ్యంగా టీడీపీ నాయ‌కుల‌ను ఆక‌ర్షించి, పార్టీలోకి తీసుకోవాల‌ని బీజేపీ అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంది.

బీజేపీ తీసుకున్న నిర్ణ‌యంపై చంద్ర‌బాబుకు ఒక‌రకంగా షాక్ ఇచ్చిన‌ట్లే ఉంది. కానీ, దీనిపై ఎలా స్పందిస్తార‌న్న‌దే ఇప్పుడు ఆసక్తిక‌రంగా మారింది. ఏపీకి ఉన్న అవ‌స‌రాల దృష్ట్యా బీజేపీతో పొత్తు అనివార్యం. అలాగ‌ని త‌మ పార్టీ నేత‌ల‌ను బీజేపీలో చేర్చుకుంటామంటే ఒప్పుకోరు. మ‌రి నోరు తెరిచి ఆ మాట అడిగే ధైర్యం చంద్ర‌బాబు చేస్తారా? అన్న‌ది అనుమాన‌మే! ఇటీవ‌ల జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ నాయ‌కుడు సురేష్ ప్ర‌భుకు పిలిచి మ‌రీ రాజ్య‌స‌భ ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు ఆ మిత్రుడికి వ్య‌తిరేకంగా ఎలా మాట్లాడుతుంది ? తెలంగాణ‌లో దాదాపుగా తుడిచి పెట్టుకుపోయిన కేడ‌ర్‌ను ఎలా కాపాడుకుంటుంది? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో స‌రికొత్త మ‌లుపుల‌కు కార‌ణ‌మ‌య్యాయి.

click on image to read-

Tags:    
Advertisement

Similar News