పవన్ కోసం వంద కోట్లు అడిగిన త్రివిక్రమ్
పవన్-త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనిమీద త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. నవంబర్ లో సినిమాను గ్రాండ్ గా ప్రారంభించి… డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా… ఈ సినిమా బడ్జెట్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవును… పవన్ సినిమా కోసం ఏకంగా వంద కోట్ల రూపాయల బడ్జెట్ కావాలని త్రివిక్రమ్ అడిగాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ తీసిన గత […]
పవన్-త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనిమీద త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. నవంబర్ లో సినిమాను గ్రాండ్ గా ప్రారంభించి… డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా… ఈ సినిమా బడ్జెట్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవును… పవన్ సినిమా కోసం ఏకంగా వంద కోట్ల రూపాయల బడ్జెట్ కావాలని త్రివిక్రమ్ అడిగాడని తెలుస్తోంది.
త్రివిక్రమ్ తీసిన గత 3 సినిమాల్ని పరిశీలిస్తే… అన్నీ మీడియం బడ్జెట్ సినిమాలే. మరీ ముఖ్యంగా అన్నీ ఫ్యామీలీ ఓరియంటెట్ సినిమాలే. అ..ఆ, సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది… ఈ మూడూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లే. కాబట్టి త్రివిక్రమ్ నెక్ట్స్ తీయబోయేది కూడా దాదాపు ఫ్యామిలీ కథే ఉంటుంది. ఇలాంటి కథకు వంద కోట్ల బడ్జెట్ అవసరం లేదనేది నిపుణుల మాట. కానీ త్రివిక్రమ్ మాత్రం ప్లాన్ మార్చాడు.
పవన్ కల్యాణ్ ను హీరోగా పెట్టి అతిభారీ యాక్షన్ సినిమా ప్లాన్ చేశాడట త్రివిక్రమ్. అతడు, జల్సా తరహాలో యాక్షన్ ఎంటర్ టైనర్ తీయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటివరకు వరుసగా కుటుంబ కథలే చేశాడు కాబట్టి… మార్పు కోసం హాలీవుడ్ తరహాలో పక్కా యాక్షన్ ఓరియంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. కాబట్టి దీనికోసం వంద కోట్లు అవసరమవుతాయని అంటున్నాడు త్రివిక్రమ్.