సినిమా చూపించ‌డం అంటే....ఇదీ!

భార్య‌ని భ‌ర్త ప్రేమగా సినిమాకు తీసుకువెళ్ల‌టం చాలా ఇళ్ల‌లో జ‌రుగుతూనే ఉంటుంది. కానీ హిమాచ‌ల్ ప్రదేశ్, హ‌మీర్ పూర్‌కి చెందిన‌ శంక‌ర్ మాత్రం త‌న భార్య గీతాంజ‌లికి సినిమా చూపించిన విధానం మాత్రం చాలా భిన్నం. ఆమె త‌న అభిమాన హీరో స‌ల్మాన్ ఖాన్ సినిమా సుల్తాన్‌ని చూడాల‌ని ఉంద‌ని భ‌ర్త‌ని అడిగింది. అంతే… సినిమా విడుద‌ల‌కు ఒక‌రోజు ముందే అత‌ను గురుకుల్ మాల్‌లో ఉన్న థియేట‌ర్ మొత్తాన్ని బుక్ చేశాడు. భార్య‌ను మొత్తం ఖాళీగా ఉన్న థియేట‌ర్‌కు తీసుకువెళ్లి సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచెత్తాడు. ఆమే కాదు, […]

Advertisement
Update:2016-07-08 06:17 IST

భార్య‌ని భ‌ర్త ప్రేమగా సినిమాకు తీసుకువెళ్ల‌టం చాలా ఇళ్ల‌లో జ‌రుగుతూనే ఉంటుంది. కానీ హిమాచ‌ల్ ప్రదేశ్, హ‌మీర్ పూర్‌కి చెందిన‌ శంక‌ర్ మాత్రం త‌న భార్య గీతాంజ‌లికి సినిమా చూపించిన విధానం మాత్రం చాలా భిన్నం. ఆమె త‌న అభిమాన హీరో స‌ల్మాన్ ఖాన్ సినిమా సుల్తాన్‌ని చూడాల‌ని ఉంద‌ని భ‌ర్త‌ని అడిగింది. అంతే… సినిమా విడుద‌ల‌కు ఒక‌రోజు ముందే అత‌ను గురుకుల్ మాల్‌లో ఉన్న థియేట‌ర్ మొత్తాన్ని బుక్ చేశాడు. భార్య‌ను మొత్తం ఖాళీగా ఉన్న థియేట‌ర్‌కు తీసుకువెళ్లి సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచెత్తాడు. ఆమే కాదు, ఆ థియేట‌ర్ సిబ్బంది కూడా అలాగే తెల్ల‌బోయారు. సీట్ల‌న్నీ బుక్ చేసుకున్న అత‌ను 120 మందితో క‌లిసి సినిమాకు వ‌స్తాడ‌ని అనుకున్న వారు, భార్య‌ని మాత్ర‌మే తీసుకుని రావ‌టంతో ఊహించని ప‌రిణామానికి ఆశ్చ‌ర్య‌పోయారు.

Tags:    
Advertisement

Similar News