ఒకేసారి రెండు ఇన్నింగ్స్ లు ప్రారంభం...

ఈమధ్య అంతా వ్యక్తిగత విషయాలతో వార్తల్లో వ్యక్తిగా మారింది కరిష్మాకపూర్. ఇప్పుడు మరోసారి అటు వ్యక్తిగత విషయాలతో పాటు… కెరీర్ పరంగా కూడా వార్తల్లో నిలిచింది. ఇటీవలే ఈమె తన భర్త నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆమె మరోసారి పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కరిష్మాకు రెండో పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆమె సినిమాలతో కూడా బిజీ అవ్వాలని చూస్తోంది. ఓ వైపు […]

Advertisement
Update:2016-07-03 02:30 IST

ఈమధ్య అంతా వ్యక్తిగత విషయాలతో వార్తల్లో వ్యక్తిగా మారింది కరిష్మాకపూర్. ఇప్పుడు మరోసారి అటు వ్యక్తిగత విషయాలతో పాటు… కెరీర్ పరంగా కూడా వార్తల్లో నిలిచింది. ఇటీవలే ఈమె తన భర్త నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆమె మరోసారి పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కరిష్మాకు రెండో పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆమె సినిమాలతో కూడా బిజీ అవ్వాలని చూస్తోంది. ఓ వైపు పెళ్లి చేసుకున్నప్పటికీ… సినిమాల్లో కూడా కొనసాగాలనుకుంటోంది. ఈ షరతుకు అంగీకరిస్తేనే ఎవరినైనా పెళ్లాడాలని కరిష్మా భావిస్తోందట. ఇప్పటికే కరిష్మా కోసం 2-3 సంబంధాలు చూసి పెట్టారట. అయితే వాటిలోంచి దేన్నీ కరిష్మా ఇంకా సెలక్ట్ చేయలేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం… 2-3 సినిమాలు చేసిన తర్వాతే మరో పెళ్లి గురించి ఆలోచించాలని కరిష్మా భావిస్తోంది. 2013లో వచ్చిన బాంబే టాకీస్ సినిమా కరిష్మా కపూర్ నటించిన ఆఖరి చిత్రం. ఆ తర్వాత వ్యక్తిగత విషయాలతో కెమెరాకు దూరమైంది. ఇప్పుడు మరోసారి సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటోంది.

Tags:    
Advertisement

Similar News