రూ. 11.5 కోట్ల ఖర్చుపై కొత్త లాజిక్ చెప్పిన స్పీకర్‌ కోడెల

నిబంధనల ప్రకారం వైసీపీ అనర్హత పిటిషన్లు లేవంటూ వాటిని తిరస్కరించిన స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రెస్‌ మీట్‌ నిర్వహించి మరీ ఆ విషయాన్ని చెప్పారు. ఈ సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులు గత ఎన్నికల్లో 11.5కోట్లు ఖర్చు పెట్టానంటూ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కోడెల … కోడిగుడ్డుపై ఈకలు పీకడం సరికాదంటూ సింపుల్‌గా తేల్చేశారు. తాను 11.5కోట్లు ఖర్చుచేసినట్టు ఎక్కడా చెప్పలేదన్నారు. గత ఎన్నికల్లో 11.5కోట్లు ఖర్చు అయిందని మాత్రమే చెప్పానంటూ లాజిక్‌ […]

Advertisement
Update:2016-07-02 14:14 IST

నిబంధనల ప్రకారం వైసీపీ అనర్హత పిటిషన్లు లేవంటూ వాటిని తిరస్కరించిన స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రెస్‌ మీట్‌ నిర్వహించి మరీ ఆ విషయాన్ని చెప్పారు. ఈ సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులు గత ఎన్నికల్లో 11.5కోట్లు ఖర్చు పెట్టానంటూ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కోడెల … కోడిగుడ్డుపై ఈకలు పీకడం సరికాదంటూ సింపుల్‌గా తేల్చేశారు. తాను 11.5కోట్లు ఖర్చుచేసినట్టు ఎక్కడా చెప్పలేదన్నారు. గత ఎన్నికల్లో 11.5కోట్లు ఖర్చు అయిందని మాత్రమే చెప్పానంటూ లాజిక్‌ చెప్పారు. అంటే ఆయన ఉద్దేశం మొత్తం ఎన్నికల నిర్వాహణకు అన్ని పార్టీలకు కలిసి రూ. 11.5కోట్లు అయిందన్నమాట. భలే ఉంది లాజిక్.

ఇటీవల ఒక తెలుగు టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో… తాను 1983లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 30 వేల రూపాయల ఖర్చు అయిందని కోడెల చెప్పారు. ఆ సొమ్మును కూడా జనం చందాలు వేసుకుని ఇచ్చారన్నారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం రూ. 11. 5కోట్లు ఖర్చు అయిందని కెమెరా సాక్షిగా చెప్పారు కోడెల. ఆ వ్యాఖ్యలు వింటే ఎవరికైనా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావే 11. 5కోట్లు ఖర్చు పెట్టినట్టు ఒప్పుకోవడం స్పష్టంగా అర్థమవుతుంది. కానీ స్పీకర్‌ మాత్రం ఇలా కొత్త లాజిక్‌ తెరపైకి తెచ్చి… కోడి గుడ్డుపై ఈకలు పీకవద్దని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News