ఆ స్కూలు టాపరు జీవితం...బాల్యవివాహం నుండి భర్త హత్య వరకు…!
పరిస్థితులు మనుషుల జీవితాలమీద ఎంతటి ప్రభావం చూపుతాయో ఈ సంఘటన రుజువు చేస్తుంది. చక్కగా చదువుకుంటున్న అమ్మాయికి ఓ తాగుబోతుని ఇచ్చి పెళ్లి చేశారు. బాల్య వివాహం అనే నేరంతో మొదలైన ఆమె వైవాహిక జీవితంలో అంతకంటే పెద్ద అపశృతి చోటుచేసుకుంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని కనోటా అనే గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 16ఏళ్ల బాలిక చేతిలో ఆమె భర్త మృతి చెందాడు. మూడేళ్ల క్రితం ఓపెన్ స్కూలు ఎనిమిదవ తరగతి పరీక్షల్లో టాపర్గా […]
పరిస్థితులు మనుషుల జీవితాలమీద ఎంతటి ప్రభావం చూపుతాయో ఈ సంఘటన రుజువు చేస్తుంది. చక్కగా చదువుకుంటున్న అమ్మాయికి ఓ తాగుబోతుని ఇచ్చి పెళ్లి చేశారు. బాల్య వివాహం అనే నేరంతో మొదలైన ఆమె వైవాహిక జీవితంలో అంతకంటే పెద్ద అపశృతి చోటుచేసుకుంది.
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని కనోటా అనే గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 16ఏళ్ల బాలిక చేతిలో ఆమె భర్త మృతి చెందాడు. మూడేళ్ల క్రితం ఓపెన్ స్కూలు ఎనిమిదవ తరగతి పరీక్షల్లో టాపర్గా నిలిచిన బాలికకు ల్యాప్టాప్ బహుమతిగా లభించింది. ఆమె భర్త హర్ఫుల్ ఆటోమొబైల్ షాపులో వర్కరుగా పనిచేస్తున్నాడు. అతను పచ్చి తాగుబోతు. తాగుడుకోసం ల్యాప్టాప్ని అమ్మడానికి తీసుకువెళ్లబోయాడు. బాలిక అతనికి అడ్డుపడింది. అతను వినకపోవటంతో ఆవేశంలో కుండకు కుదురుగా పెట్టే రాయిని అతనిపై విసిరికొట్టింది. అది అతనికి బలంగా తగలటంతో కింద పడిపోయాడు.
ఆమె ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పటంతో వారు, అక్కడికి వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. ఈ ఉదంతంలో మనకు స్పష్టంగా మరొక తప్పు సైతం కనబడుతున్నది. స్కూలు టాపర్గా నిలిచిన అమ్మాయికి చదువు మాన్పించి బాల్య వివాహం చేశారు. అదీ మద్యానికి బానిస అయిన వ్యక్తికి ఇచ్చి. చదువు పట్ల అంత ప్రేమ ఉన్న అమ్మాయికి చదువుకునే అవకాశం లేకపోగా, చివరికి హంతకురాలిగా మిగలటం వెనుక ఆమె కుటుంబం, ప్రభుత్వం పాత్రకూడా ఉందనటంతో సందేహం లేదు.