బన్నీని ఇంకా వీడని పవన్ గోల

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బెడద బన్నీని ఇంకా వీడలేదు. ఎప్పుడు ఏం మాట్లాడాలనుకున్నా… పవర్ స్టార్, పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ గోలచేయడాన్ని బన్నీ తీవ్రంగా ఖండించాడు. ఒక మససు ఆడియో ఫంక్షన్ లో పవన్ ఫ్యాన్స్ కు క్లాస్ కూడా పీకాడు. అది అప్పట్లో పెను సంచలనం అయింది. ఆ తర్వాత బన్నీ చెప్పాపెట్టకుండా విహార యాత్రలకు వెళ్లిపోయాడు. అయితే బన్నీ ఎప్పుడు తిరిగొస్తాడా అని పవన్ ఫ్యాన్స్ మాత్రం కాచుక్కూర్చున్నారు. సరిగ్గా సైమా […]

Advertisement
Update:2016-07-02 08:09 IST
బన్నీని ఇంకా వీడని పవన్ గోల
  • whatsapp icon

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బెడద బన్నీని ఇంకా వీడలేదు. ఎప్పుడు ఏం మాట్లాడాలనుకున్నా… పవర్ స్టార్, పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ గోలచేయడాన్ని బన్నీ తీవ్రంగా ఖండించాడు. ఒక మససు ఆడియో ఫంక్షన్ లో పవన్ ఫ్యాన్స్ కు క్లాస్ కూడా పీకాడు. అది అప్పట్లో పెను సంచలనం అయింది. ఆ తర్వాత బన్నీ చెప్పాపెట్టకుండా విహార యాత్రలకు వెళ్లిపోయాడు. అయితే బన్నీ ఎప్పుడు తిరిగొస్తాడా అని పవన్ ఫ్యాన్స్ మాత్రం కాచుక్కూర్చున్నారు. సరిగ్గా సైమా వేడుకల్లో బన్నీ మళ్లీ దొరికిపోయాడు. సింగపూర్ లో జరిగిన సైమా వేడుకల్లో మాట్లాడ్డానికి స్టేజ్ పైకి వచ్చిన బన్నీని పవనిజం ఫ్యాన్స్ అడ్డుకున్నారు. పవర్ స్టార్… పవర్ స్టార్… అంటూ బన్నీని మాట్లాడనీయకుండా తెగ గోల చేశారు. దీంతో బన్నీకి మరోసారి కోపం వచ్చింది. అయితే ఈసారి మాత్రం బన్నీ కంట్రోల్ చేసుకున్నాడు. ” హే గమ్మునుండవోయ్ …… మాట్లాడనీ ” అంటూ ”రుద్రమదేవి ” చిత్రంలోని గోన గన్నారెడ్డి డైలాగ్ ని పవర్ స్టార్ ఫ్యాన్స్ పై వదిలాడు. మొత్తానికి ఎలాగోలా తన స్పీచ్ ను పూర్తిచేసి కిందకు వచ్చేశాడు. చూస్తుంటే… ఈసారి బన్నీ విషయాన్ని పవన్ ఫ్యాన్స్ కాస్త సీరియస్ గానే తీసుకున్నట్టు ఉన్నారు. ఈ ఎఫెక్ట్ బన్నీ నెక్ట్స్ సినిమాపై కచ్చితంగా పడుతుందనడంలో సందేహం లేదు.

Click on Image to Read:

niharika

Tags:    
Advertisement

Similar News