యు టర్న్ తీసుకున్న బన్నీ

సరైనోడు సక్సెస్ తో మొన్నటివరకు విదేశీ పర్యటనల్లో ఎంజాయ్ చేశాడు బన్నీ. భార్య స్నేహ, కొడుకు అయాన్ తో కలిసి కశ్మీర్, టర్కీతోపాటు పలు ప్రదేశాలు చుట్టివచ్చాడు. అట్నుంచి వచ్చిన వెంటనే లింగుస్వామి దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టాలని భావించాడు. ఆ తర్వాతే విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే బన్నీ విహార యాత్ర పూర్తిచేసుకొని తిరిగొచ్చాడు. కానీ లింగుస్వామి సినిమా మాత్రం ప్రారంభంకాలేదు. చివరి నిమిషంలో కొన్ని తేడాలు రావడంతో ఈ కాంబినేషన్ […]

Advertisement
Update:2016-06-25 02:10 IST
సరైనోడు సక్సెస్ తో మొన్నటివరకు విదేశీ పర్యటనల్లో ఎంజాయ్ చేశాడు బన్నీ. భార్య స్నేహ, కొడుకు అయాన్ తో కలిసి కశ్మీర్, టర్కీతోపాటు పలు ప్రదేశాలు చుట్టివచ్చాడు. అట్నుంచి వచ్చిన వెంటనే లింగుస్వామి దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టాలని భావించాడు. ఆ తర్వాతే విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే బన్నీ విహార యాత్ర పూర్తిచేసుకొని తిరిగొచ్చాడు. కానీ లింగుస్వామి సినిమా మాత్రం ప్రారంభంకాలేదు. చివరి నిమిషంలో కొన్ని తేడాలు రావడంతో ఈ కాంబినేషన్ ప్రస్తుతానికి అటకెక్కిందని ఫిల్మ్ నగర్ టాక్. ఈలోపు హరీష్ శంకర్ చెప్పిన స్టోరీ బన్నీని ఇంప్రెస్ చేసిందట. బన్నీతో సినిమా చేసేందుకు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న హరీశ్ శంకర్ కు… బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తాజా సమాచారం. మరోవైపు ఈ ప్రాజెక్టును తాను నిర్మిస్తానని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా చకచకా పనులు మొదలైనట్లు ఫిల్మ్ నగర్ ఇన్ సైడ్ టాక్. గతంలో హరీష్ – దిల్ రాజు కాంబినేషన్ లో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుంది.
Tags:    
Advertisement

Similar News