సంపూను బండ బూతులు తిట్టారా?

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు కు తీవ్ర అవ‌మానం జ‌రిగింది. నిర్వాహ‌కుల తీరు కార‌ణంగా త్వ‌ర‌లో అమెరికాలో జ‌రిగే ఆటా ఉత్స‌వాల్లో ఆయ‌న పాల్గొన‌డం లేద‌ని ప్ర‌క‌టించాడు. త్వ‌ర‌లోనే అక్క‌డ జ‌రిగే ఈ వేడుక‌ల్లో పాల్గొనేందుకు సంపూ అమెరికా వెళ్లాల్సి ఉంది. అక్క‌డ నిర్వాహ‌కుల్లో ఒక‌ ముఖ్యవ్య‌క్తి సంపూను తీవ్ర ప‌ద‌జాలంతో బూతులు తిట్టడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌న్యూస్‌గా మారింది. జ‌రిగిన విష‌యాన్ని సంపూ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. న‌టీ న‌టులకూ ఆత్మ‌గౌర‌వం ఉంటుంద‌ని, న‌టులంటే బిచ్చ‌గాళ్లు, […]

Advertisement
Update:2016-06-24 05:20 IST
బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు కు తీవ్ర అవ‌మానం జ‌రిగింది. నిర్వాహ‌కుల తీరు కార‌ణంగా త్వ‌ర‌లో అమెరికాలో జ‌రిగే ఆటా ఉత్స‌వాల్లో ఆయ‌న పాల్గొన‌డం లేద‌ని ప్ర‌క‌టించాడు. త్వ‌ర‌లోనే అక్క‌డ జ‌రిగే ఈ వేడుక‌ల్లో పాల్గొనేందుకు సంపూ అమెరికా వెళ్లాల్సి ఉంది. అక్క‌డ నిర్వాహ‌కుల్లో ఒక‌ ముఖ్యవ్య‌క్తి సంపూను తీవ్ర ప‌ద‌జాలంతో బూతులు తిట్టడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌న్యూస్‌గా మారింది. జ‌రిగిన విష‌యాన్ని సంపూ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. న‌టీ న‌టులకూ ఆత్మ‌గౌర‌వం ఉంటుంద‌ని, న‌టులంటే బిచ్చ‌గాళ్లు, వ్య‌భిచారులు కాద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఈ విష‌యంలో న‌టి, యాంక‌ర్ అన‌సూయ కూడా సంపూర్ణేష్ బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచారు.
సంపూ ఏమ‌న్నాడు
ఆటా లో ఓ ముఖ్య‌వ్య‌క్తి న‌న్ను తీవ్ర ప‌ద‌జాలంతో దూషించారు. అమ్మ‌, ఆలీ.. —- కొడ‌కా అంటూ బండ‌బూతులు తిట్టారు. న‌టుల‌ను ఇంత హీనంగా అవ‌మాన‌ ప‌రుస్తారా అని సంపూ వ‌రుస ట్వీట్ల‌తో వెల్ల‌డించాడు. అయినా, త‌న‌కు ఆటా అంటే అంతులేని అభిమానం ఉంద‌ని, తాను ఈ అవ‌మానం కార‌ణంగానే తాను ఈ ఏడాది జ‌రిగే.. ఆటా వేడుక‌ల్లో పాల్గొన‌లేక‌పోతున్న‌ట్లు తెలియ‌జేశాడు. వ‌చ్చే ఏడాది మాత్రం త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని చెప్పాడు. నా ప్రాణాల‌కు ముప్పు ఉంది. అందువ‌ల్ల నేను అక్క‌డికి రాలేక‌పోతున్నాను అని ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు. విదేశాల్లో ఉన్న‌ తెలుగు అభిమానుల‌కు వినోదాన్ని పంచేందుకు వెళ్లే త‌మ‌లాంటి చిన్న‌న‌టుల‌కు ఇలాంటి అవ‌మానాలు స‌హ‌జ‌మేన‌ని, వీటికి ఒక ప‌రిష్కారం మాత్రం త్వ‌ర‌లోనే రావాల‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు.
సంపూకు నిర్వాహ‌కుల‌కు మ‌ధ్య వివాదం ఎందుకు తలెత్తిందో మాత్రం ఆయ‌న తెల‌ప‌లేదు. వివాదం ఎలా మొద‌లైంది? అది ఇంత‌దూరం ఎందుకు వ‌చ్చింది? అన్న విష‌యాల‌పై ఇప్ప‌టిదాకా ఎలాంటి స్ప‌ష్టత లేదు.
Tags:    
Advertisement

Similar News