పగ్గాలు మాకిస్తే.. నా సామి రంగా!
రాజకీయ నాయకులు పదవిలోకి రావడానికి వారి సామర్థ్యాలను, వ్యూహాలను అప్పుడప్పుడూ బయటపెడుతుంటారు. వీలు చిక్కినపుడు తమ మనసులో మాటలను మీడియాతో పంచుకుంటుంటారు. ఇలాంటి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో కాస్త ఎక్కువే ఉంటుంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ విఫలమయ్యాడంటూ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసి ఆయన్ను చిక్కుల్లో పడేశాడు. అన్న వ్యాఖ్యలకు మద్దతిచ్చేలా.. ఉత్తమ్ కుమార్‌ను ఇబ్బంది పెట్టేలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేశాడు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి […]
Advertisement
రాజకీయ నాయకులు పదవిలోకి రావడానికి వారి సామర్థ్యాలను, వ్యూహాలను అప్పుడప్పుడూ బయటపెడుతుంటారు. వీలు చిక్కినపుడు తమ మనసులో మాటలను మీడియాతో పంచుకుంటుంటారు. ఇలాంటి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో కాస్త ఎక్కువే ఉంటుంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ విఫలమయ్యాడంటూ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసి ఆయన్ను చిక్కుల్లో పడేశాడు. అన్న వ్యాఖ్యలకు మద్దతిచ్చేలా.. ఉత్తమ్ కుమార్‌ను ఇబ్బంది పెట్టేలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేశాడు.
కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి నాయకత్వ లోపం లేదంటూనే పార్టీ పగ్గాలు తమ సోదరులకు అప్పజెబితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. తమకుగానీ.. పార్టీ పగ్గాలు అప్పజెబితే… 2019లో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకు వస్తామని ధీమా వ్యక్తం చేశాడు. నిన్న నల్లగొండ జిల్లా చిట్యాలలో ఆయన ఈ కామెంట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియాపై తెలంగాణ ప్రజలు సానుకూలంగా ఉన్నారన్నారు. సరైన వ్యూహంతో వెళితే… 2019లో కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
త్వరలో ఉత్తమ్ టీపీసీసీ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్న వేళ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీ పగ్గాలు తమ సోదరులకు అప్పజెప్పాలని వెల్లడించి… టీపీసీసీ అధ్యక్ష పదవిరేసులో తామూ ఉన్నట్లు ముందే ప్రకటించాడు. ఓ వైపు టీపీసీసీ రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్న క్రమంలోనే రాజగోపాల్ సైతం తమ ఆసక్తిని తెలియజేశాడు. నిన్నటి దాకా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పై విమర్శలు కొనసాగించిన పలువురు నేతలు అదే పదవి కోసం రేసులో నిలవడం పార్టీలో చర్చానీయాంశంగా మారింది. పదవిలో ఉన్న పవర్ అదే మరి!
Advertisement