అంతకంటే లేట్ గా స్టార్టయింది... అప్పుడే పూర్తయింది...

జనతా గ్యారేజీలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం అయిన తర్వాతే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభించాడు. అయితే జనతా గ్యారేజీ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేసిన మనమంతా చిత్రం షూటింగ్ మాత్రం అప్పుడే కంప్లీట్ అయిపోయింది.  మోహన్ లాల్, గౌతమి, విశ్వంత్, రైనా రావు, అమితా అంబ్రోస్ ప్రధాన పాత్రల్లో చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మనమంతా’. నిక్సన్ […]

Advertisement
Update:2016-06-20 13:14 IST
జనతా గ్యారేజీలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం అయిన తర్వాతే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభించాడు. అయితే జనతా గ్యారేజీ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేసిన మనమంతా చిత్రం షూటింగ్ మాత్రం అప్పుడే కంప్లీట్ అయిపోయింది.
మోహన్ లాల్, గౌతమి, విశ్వంత్, రైనా రావు, అమితా అంబ్రోస్ ప్రధాన పాత్రల్లో చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మనమంతా’. నిక్సన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఓ పాటతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. మూడు భాషల్లోను తన పాత్రకి మోహన్‌లాల్ స్వయంగా డబ్బింగ్ చెప్తుండటం హైలైట్ . ఇతర ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి జులైలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో మొదలు కానున్నాయి. వారాహి చలన చిత్రం సంస్థ నిర్మించిన ఈ సినిమా విస్మయం, నమదు పేర్లతో మలయాళ, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. మహేష్ శంకర్ స్వరపరిచిన పాటలు సైతం అతి త్వరలో విడుదల అవుతాయని చెబుతున్నారు.
Tags:    
Advertisement

Similar News