జానారెడ్డి స్థానంలో డీకే!
తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందన్న వార్త ఇప్పుడు గాంధీభవన్‌లో చక్కర్లు కొడుతోంది. విషయమేంటంటే.. ప్రస్తుతం అసెంబ్లీలో శాసనసభా పక్ష నేతగా ఉన్న జానారెడ్డి త్వరలో తన పదవికి రాజీనామా చేయనున్నారని సమాచారం. ఇటీవల కారు పార్టీకి కాంగ్రెస్ నేతలు వలసలు పోతుండటంపై పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. ఈ విషయంలో పాల్వాయి గోవర్దన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలు జానారెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన టీఆర్ ఎస్ […]
Advertisement
తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందన్న వార్త ఇప్పుడు గాంధీభవన్‌లో చక్కర్లు కొడుతోంది. విషయమేంటంటే.. ప్రస్తుతం అసెంబ్లీలో శాసనసభా పక్ష నేతగా ఉన్న జానారెడ్డి త్వరలో తన పదవికి రాజీనామా చేయనున్నారని సమాచారం. ఇటీవల కారు పార్టీకి కాంగ్రెస్ నేతలు వలసలు పోతుండటంపై పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. ఈ విషయంలో పాల్వాయి గోవర్దన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలు జానారెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన టీఆర్ ఎస్ కు కోవర్టులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పైగా గతంలో ఆయన పార్టీ మారతారని పదేపదే వచ్చిన పుకార్లను ప్రస్తావించారు. దీనికితోడు మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా జానారెడ్డిపై విరుచుకుపడ్డారు. ఈ ఆరోపణలు రావడంతో జానా తీవ్రంగా నొచ్చుకున్నారు. తనపై ఆరోపణలు చేసినపుడు ఏ నేతా స్పందించకపోవడంపై ఆయన పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే!
దీనికితోడు ఆయన ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితితో సంప్రదింపులు జరిపారన్న విషయం కొత్త చర్చకు తెరతీసింది. ఇందులో వాస్తవమెంతుందో తెలియదు కానీ, ఆయన తనకు రాజ్యసభ సీటు ఇస్తే పార్టీ మారేందుకు సిద్ధపడ్డారన్నది ఈ పుకారు సారాంశం. కానీ, టీఆర్ ఎస్ రాజ్యసభ ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారని కొందరు చెబుతున్నారు. అయితే, తాను పార్టీ మారుతున్నారని ఓ వ్యక్తి కావాలని ఇలాంటి వార్తలు రాయిస్తున్నారని ఇటీవల జానా వాపోయాడు. ఇప్పుడు ఈవార్తలు కూడా తానంటే గిట్టనివారే పుట్టించారని సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. అందుకే, తాను శాసనభ పక్ష నేతగా తప్పుకోవాలని నిర్ణయించారని సమాచారం. మరి జానా స్థానం ఖాళీ అయితే, ఈ పోస్టులో డీకే అరుణకు అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నారు. వర్షకాల అసెంబ్లీ సమావేశాల్లోగా ఇవన్నీ పుకార్లా? వాస్తవమా? అన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Advertisement