ఉచ్చులో పడలేం...- సీఎం vs సీఎస్

చంద్రబాబు రహస్య ఎజెండా దెబ్బకు అధికారులు వణికిపోతున్నారు. ముడుపుల కోసం ప్రభుత్వ పెద్దలు నడుపుతున్న వ్యవహారాలనుచూసి అధికారయంత్రాంగం ఆలోచనలో పడినట్టు కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం సాగునీటిప్రాజెక్టుల అంచనాలను వేలకోట్లకు పెంచిన ఫైల్‌పై సంతకం చేసేందుకు అప్పటి సీఎస్‌ కృష్ణారావు, ఇప్పటి సీఎస్ టక్కర్ కూడా నిరాకరించారని విషయం సంచలనం సృష్టించింది. తాజాగా రాజధాని నిర్మాణపనులను తనకు ఇష్టమైన విదేశీ కంపెనీలకు అప్పగించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను సీఎస్‌తో పాటు కీలకఅధికారులు వ్యతిరేకిస్తున్నారు.  ఫైళ్లపై గుడ్డిగా సంతకాలు […]

Advertisement
Update:2016-06-19 04:11 IST

చంద్రబాబు రహస్య ఎజెండా దెబ్బకు అధికారులు వణికిపోతున్నారు. ముడుపుల కోసం ప్రభుత్వ పెద్దలు నడుపుతున్న వ్యవహారాలనుచూసి అధికారయంత్రాంగం ఆలోచనలో పడినట్టు కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం సాగునీటిప్రాజెక్టుల అంచనాలను వేలకోట్లకు పెంచిన ఫైల్‌పై సంతకం చేసేందుకు అప్పటి సీఎస్‌ కృష్ణారావు, ఇప్పటి సీఎస్ టక్కర్ కూడా నిరాకరించారని విషయం సంచలనం సృష్టించింది. తాజాగా రాజధాని నిర్మాణపనులను తనకు ఇష్టమైన విదేశీ కంపెనీలకు అప్పగించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను సీఎస్‌తో పాటు కీలకఅధికారులు వ్యతిరేకిస్తున్నారు.

ఫైళ్లపై గుడ్డిగా సంతకాలు పెట్టేందుకు ససేమిరా అంటున్నారు. రాజధాని నిర్మాణ అప్పగింతకు మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే ఆమోదముద్ర వేసేయడం, ఆ తర్వాత ఫైలు తమ వద్దకు పంపడంపై సీఎస్‌తో పాటు అధికారులు కంగుతిన్నారు. దీనిపై సీఆర్‌డీఏ అధికారుల వద్ద సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆమోదించిన తరువాత అధికారులతో కూడిన అథారిటీ సమావేశానికి ఫైల్ పంపించడమేమిటని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ మండిపడ్డారు.

మంత్రుల సిఫార్సులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన తరువాత అధికారులతో కూడిన అధారిటీ ఏ విధంగా ఆమోదం తెలుపుతుందో చెప్పాలని సీఆర్‌డీఏ అధికారులను సీఎస్ ప్రశ్నించారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఈ ఫైల్‌ను వెంటనే ఆమోదించాలని పీకలమీద కూర్చుంటే కుదరదని సీఎస్ స్పష్టం చేశారు. అంత అవసరమే ఉంటే నేరుగా మీరే కేబినెట్‌కు తీసుకెళ్లండి అంటూ మండిపడ్డారు. సంబంధిత శాఖల అభిప్రాయాలను తీసుకోకుండా అధారిటీ ముందుకు ఫైల్‌ను నేరుగా ఎలా తెస్తారంటూ టక్కర్ ప్రశ్నించే సరికి సీఆర్‌డీఏ అధికారులు కూడా నీళ్లు నమిలారు.

సీఎస్ ఆగ్రహం చూసిన సీఆర్‌డీఏ అధికారులు ఫైలు అన్ని డిపార్ట్‌మెంట్లకు సర్క్యులేట్ చేసి అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపైనా సీఎస్ తీవ్రంగా స్పందించారు. సీఎం ఆమోదం తెలిపిన ఫైల్‌పై అధికారులు అభ్యంతరం తెలిపేంత స్వేచ్చ, పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అసలు ఏ రూల్‌ ప్రకారం ఇలా ఇష్టానుసారం చేస్తున్నారో అర్థం కావడం లేదని సీఎస్ వాపోయారని సమాచారం. పలువులు సీనియర్ అధికారులు కూడా ఈ విషయంలో సీఎస్‌కు బాసటగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్, అందునా రాజధాని నిర్మాణం విషయంలో గుడ్డిగా సంతకాలు పెడితే సీఎం, ప్రజాప్రతినిధులుగా బాగానే ఉంటారని ఇరుక్కునేది తామేనని ఆందోళనతో ఉన్నారు.

సీఎం ఆమోదించిన మంత్రుల కమిటీ సిఫార్సులతో పాటు సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన రాయితీ, అభివృద్ధి అగ్రిమెంట్ ముసాయిదాపై సీఎస్ పలు సందేహాలను వ్యక్తం చేశారు. చివరకు దీనిపై న్యాయ శాఖ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా సీఎస్ కోరారు. మొత్తం మీద ఇష్టమైన సింగపూర్‌ కంపెనీకి రాజధానిని అప్పగించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు చూసి అధికారులు ఆందోళనలో ఉన్నట్టు స్పష్టమవుతోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News