కాపు నేతలను కాల్వ శ్రీనివాస్ కూడా తిట్టేశారు...
ముద్రగడ దీక్షకు మద్దతు తెలుపుతున్న కాపు నేతలపై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ మండిపడ్డారు. కాపుల ప్రయోజనాలకు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చిత్తశుద్దితో ప్రయత్నిస్తుంటే కాపు నేతలు సహకరించడం లేదన్నారు. ముద్రగడ దీక్ష దుందుడుకు చర్య అని తేల్చేశారు. చిరంజీవి కూడా కాపుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాపుల పాలిట చిరంజీవి మెగాస్టార్ కాదని ఒక దగాస్టార్ అని అభివర్ణించారు. మూడేళ్లు కూడా పార్టీని నడపలేక మంత్రి పదవి కోసం పార్టీనే […]
ముద్రగడ దీక్షకు మద్దతు తెలుపుతున్న కాపు నేతలపై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ మండిపడ్డారు. కాపుల ప్రయోజనాలకు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చిత్తశుద్దితో ప్రయత్నిస్తుంటే కాపు నేతలు సహకరించడం లేదన్నారు.
ముద్రగడ దీక్ష దుందుడుకు చర్య అని తేల్చేశారు. చిరంజీవి కూడా కాపుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాపుల పాలిట చిరంజీవి మెగాస్టార్ కాదని ఒక దగాస్టార్ అని అభివర్ణించారు. మూడేళ్లు కూడా పార్టీని నడపలేక మంత్రి పదవి కోసం పార్టీనే కాంగ్రెస్‌లో విలీనం చేసిన వ్యక్తి చిరంజీవి అని విమర్శించారు.
అసలు కాపుల రిజర్వేషన్ సమస్య ఈనాటిది కాదని… రిజర్వేషన్ల అంశంలో సాంకేతిక సమస్యలున్నాయని తేల్చేశారు. కాపు ఉద్యమం ముసుగులో కొన్ని అసాంఘిక శక్తులు విధ్వంసానికి పాల్పడితే వారిని వదిలేయాలా అని ప్రశ్నించారు కాల్వ శ్రీనివాస్. తుని నిందితులపై కేసులు ఎత్తివేయడం అసాధ్యమని తేల్చేశారు. సీఐడీ విచారణ నిలిపివేస్తామని కూడా ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు.
Click on Image to Read: