బికినీ కోసం భారీగా బరువు తగ్గింది
ఏ హీరోయిన్ కు, ఎలాంటి దుస్తులైనా నప్పుతాయి. కానీ బికినీ వేయాలంటే మాత్రం సన్నజాజి తీగ లాంటి ఫిజిక్ కావాలి. ఎవరు పడితే వాళ్లు బికినీ వేయడం సాధ్యం కాదు. ఎందుకంటే.. హీరోయిన్ల వయ్యారమంతా బయటపడేది బికినీలోనే. అందుకే అనుష్క లాంటి హీరోయిన్లు బికినీకి చాలా దూరంగా ఉంటారు. అది తమకు సూట్ కాదనే విషయం ఆమెకు తెలుసు. చాలామంది తెలుగు హీరోయిన్ల పరిస్థితి ఇదే. కానీ బాలీవుడ్ హీరోయిన్లకు బికినీ వేయడం అంటే ఆమ్లెట్ వేయడం […]
Advertisement
ఏ హీరోయిన్ కు, ఎలాంటి దుస్తులైనా నప్పుతాయి. కానీ బికినీ వేయాలంటే మాత్రం సన్నజాజి తీగ లాంటి ఫిజిక్ కావాలి. ఎవరు పడితే వాళ్లు బికినీ వేయడం సాధ్యం కాదు. ఎందుకంటే.. హీరోయిన్ల వయ్యారమంతా బయటపడేది బికినీలోనే. అందుకే అనుష్క లాంటి హీరోయిన్లు బికినీకి చాలా దూరంగా ఉంటారు. అది తమకు సూట్ కాదనే విషయం ఆమెకు తెలుసు. చాలామంది తెలుగు హీరోయిన్ల పరిస్థితి ఇదే. కానీ బాలీవుడ్ హీరోయిన్లకు బికినీ వేయడం అంటే ఆమ్లెట్ వేయడం అంత ఈజీ. కానీ సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన భామలకు మాత్రం బికినీ వేయాలంటే చాలా కష్టం. అలాంటి కష్టాన్నే అనుభవిస్తోంది లక్ష్మీరాయ్. జూలీ-2 సినిమాలో బికినీ వేయడం కోసం ఈ అమ్మడు ఏకంగా 10 కిలోల బరువు తగ్గిందట. ఆ విషయాన్ని లక్ష్మీరాయ్ స్వయంగా తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో వెల్లడించింది.
జూలీ 2 లోని వివిధ వేరియేషన్స్ కోసం రకరకాల వర్కవుట్స్ చేస్తోంది లక్ష్మీరాయ్. ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ లో పక్కింటి అమ్మాయిలా సింపుల్ గా కనిపించటానికి 2 నెలల గ్యాప్ తీసుకుని బరువు పెరిగింది. ఆ తర్వాత అల్ట్రా గ్లామరస్ గెటప్ కోసం మళ్ళీ 2 నెలలు గ్యాప్ తీసుకుని భారీ కసరత్తులు చేసింది. అది కూడా మామూలుగా కాకుండా.. బికినీకి పర్ఫెక్ట్ గా సూటబుల్ కావటానికి 10 కిలోల బరువు తగ్గేలా కష్టపడిందట. ఈ విషయాలన్నీ ఆమె స్వయంగా వెల్లడించింది.
Advertisement