ఆయన్ను వదిలిపెట్టాలని వైఎస్‌ను అభ్యర్థించా... లక్ష్మీపార్వతి కంటతడి

విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో లక్ష్మీపార్వతి ఉద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి … తనను రోడ్డున పడేసిన నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు. టీడీపీలో 90 శాతం మంది అప్పట్లో తన కాళ్లు పట్టుకుని టికెట్ సంపాదించుకున్న వారేనని ఆమె చెప్పారు. అలాంటి వారే ఆ తర్వాత తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన చెందారు. కానీ జగన్ మాత్రం తనను ఒక కన్నతల్లిలా ఆదరించాడని, తనకు గౌరవం కల్పించారని ఆమె కంటతడిపెట్టుకున్నారు. […]

Advertisement
Update:2016-06-14 12:30 IST

విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో లక్ష్మీపార్వతి ఉద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి … తనను రోడ్డున పడేసిన నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు. టీడీపీలో 90 శాతం మంది అప్పట్లో తన కాళ్లు పట్టుకుని టికెట్ సంపాదించుకున్న వారేనని ఆమె చెప్పారు. అలాంటి వారే ఆ తర్వాత తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన చెందారు. కానీ జగన్ మాత్రం తనను ఒక కన్నతల్లిలా ఆదరించాడని, తనకు గౌరవం కల్పించారని ఆమె కంటతడిపెట్టుకున్నారు.

జగన్‌ తనకు కన్నబిడ్డలాంటి వాడని చెప్పారు. జగన్‌పై టీడీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం చూస్తే బాధగా ఉందన్నారు. పరోక్షంగా బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటనను కూడా ఆమె ప్రస్తావించారు. బాలకృష్ణ తప్పు చేస్తే తాను స్వయంగా వైఎస్ వద్దకు వెళ్లి ఎన్టీఆర్ గౌరవం కోసమైనా ఆయన్ను కాపాడాలని కోరానన్నారు. అందుకు వైఎస్ కూడా పెద్దమనసు చేసుకున్నారని చెప్పారు. చంద్రబాబు పాలన చూస్తుంటే రావణుడి లంకలో ఉన్నట్టుగా ఉందన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News