బాబుపై తిరుగుబాటు? పార్క్‌హయత్‌లో కాపు ప్రముఖుల కీలక భేటీ
ముద్రగడ దీక్ష విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు కాపులకు ఆగ్రహం తెప్పిస్తోంది. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు తమను అణిచివేస్తున్నారన్న భావనకు వారు వచ్చారు. ఈ నేపధ్యంలో కాపు ప్రముఖులంతా పార్క్‌హయత్ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ బేటీకి పల్లంరాజు, దాసరినారాయణ రావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, సి. రామచంద్రయ్య, అంబటిరాంబాబు, కన్నబాబు, దాడిశెట్టి రాజాతోపాటు వివిధ రంగాలకు చెందిన కాపు ప్రముఖులంతా ఈ బేటీకి హజరయ్యారు. ఈ బేటీలో చంద్రబాబు వైఖరిని కాపునేతలు […]
ముద్రగడ దీక్ష విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు కాపులకు ఆగ్రహం తెప్పిస్తోంది. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు తమను అణిచివేస్తున్నారన్న భావనకు వారు వచ్చారు. ఈ నేపధ్యంలో కాపు ప్రముఖులంతా పార్క్‌హయత్ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ బేటీకి పల్లంరాజు, దాసరినారాయణ రావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, సి. రామచంద్రయ్య, అంబటిరాంబాబు, కన్నబాబు, దాడిశెట్టి రాజాతోపాటు వివిధ రంగాలకు చెందిన కాపు ప్రముఖులంతా ఈ బేటీకి హజరయ్యారు.
ఈ బేటీలో చంద్రబాబు వైఖరిని కాపునేతలు తీవ్రంగా తప్పుపట్టినట్టు తెలుస్తోంది. కాపులపై చంద్రబాబు తీరు కక్షసాధింపు ధోరణిలో వుందని అభిప్రాయపడ్డారు. తుని ఘటన వెనుక బయటి వ్యక్తుల హస్తం వుందని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం గోదావరి జిల్లాలకు చెందిన కాపునేతలనే అరెస్టు చేయడంపై సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమాన్ని అణిచివేయాలన్న ఆలోచనతోనే చంద్రబాబు వ్యవహరిస్తున్నట్టుగా వుందని మండిపడినట్లు సమాచారం.
దీక్ష చేస్తున్న ముద్రగడను, ఆయన భార్యను పోలీసులు ఈడ్చుకుని వెళ్లడం, ముద్రగడ కుమారుడిని విచక్షణా రహితంగా కొట్టడాన్ని కాపు ప్రముఖులు తీవ్రంగా తప్పుపట్టారు. కాపు ఉద్యమం విషయంలో భవిష్యత్తు కార్యాచరణపైన కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద టీడీపీలోని కాపులు మినహా మిగిలిన అందరు కాపు ప్రముఖులు ఏకమవడం చర్చనీయాంశమైంది. ఈ భేటీ అనంతరం పరిణామాలు ఎలా వుంటాయి అన్నదానిపైన ఆసక్తి నెలకొలంది. ప్రస్తుతం చంద్రబాబు కుటుంబం కూడా కాపునేతలు భేటీ అయిన పార్క్‌హయత్ హోటల్‌లోనే నివాసముంటోంది.
Click on Image to Read: