ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? రాష్ట్ర భవిష్యత్తుపైనే ఆందోళనగా ఉంది- "కాపు, బలిజ, తెలగ ఎన్‌ఆర్‌ఐ ఫోరం" ఫైర్‌

ఆంధ్రప్రదేశ్‌లో కాపు ఉద్యమం పట్ల చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై అమెరికాలోని కాపు, బలిజ,తెలగ ఎన్‌ఆర్‌ఐలు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రయోజనాల కోసం అధికార పార్టీ పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆక్షేపించారు. చికాగోలో కాపు, బలిజ, తెలగ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలుపుతూ సభ నిర్వహించారు. ఈ సభకు ఇతర తెలుగు ఎన్‌ఆర్‌ఐలు కూడా హాజరయ్యారు. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై వారంతా కలిసిచర్చించారు. ముద్రగడ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే […]

Advertisement
Update:2016-06-13 09:32 IST

ఆంధ్రప్రదేశ్‌లో కాపు ఉద్యమం పట్ల చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై అమెరికాలోని కాపు, బలిజ,తెలగ ఎన్‌ఆర్‌ఐలు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రయోజనాల కోసం అధికార పార్టీ పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆక్షేపించారు. చికాగోలో కాపు, బలిజ, తెలగ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలుపుతూ సభ నిర్వహించారు.

ఈ సభకు ఇతర తెలుగు ఎన్‌ఆర్‌ఐలు కూడా హాజరయ్యారు. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై వారంతా కలిసిచర్చించారు. ముద్రగడ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అన్నఅనుమానం కలుగుతోందని కాపు ఎన్‌ఆర్‌ఐలు ఆవేదన చెందారు.. ఏపీ భవిష్యత్తుపైనే తమకు ఆందోళనగా ఉందని చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ముద్రగడ, ఆయన కుటుంబం పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని ఆవేదన వ్యక్తంచేశారు. మీడియాను కూడా అణచివేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాలను సమంగా చూడాల్సిన ప్రభుత్వం కేవలం ఒక పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ వీడియోను కూడా విడుదల చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News