చర్మం లేకుండా పుట్టిన చిన్నారి!
మహారాష్ట్రలోని వాడి పట్టణానికి చెందిన ఒక మహిళకు శరీరంపై చర్మంలేని శిశువు జన్మించింది. ఇలాంటి శిశువుని హర్లీ క్వీన్ బేబీ అంటారు. నాగపూర్‌లోని లతా మంగేష్కర్ ఆసుపత్రిలో జన్మించిన ఈ బేబీని చూసి వైద్యులే దిగ్భ్రాంతికి గురయ్యారు. భారత్‌లో ఇలాంటి శిశువు జన్మించడం ఇదే ప్రధమమని వైద్యులు తెలిపారు. పాపను ఐసీయు ఇంక్యుబేటర్‌లో ఉంచి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రక్తంలో సోడియం స్థాయి ఎక్కువైనపుడు పిండం ఎదుగుదల ఆగిపోతుంది. దీని వలన చర్మం ఏర్పడటంలో సమస్యలు ఏర్పడతాయి. […]
మహారాష్ట్రలోని వాడి పట్టణానికి చెందిన ఒక మహిళకు శరీరంపై చర్మంలేని శిశువు జన్మించింది. ఇలాంటి శిశువుని హర్లీ క్వీన్ బేబీ అంటారు. నాగపూర్‌లోని లతా మంగేష్కర్ ఆసుపత్రిలో జన్మించిన ఈ బేబీని చూసి వైద్యులే దిగ్భ్రాంతికి గురయ్యారు. భారత్‌లో ఇలాంటి శిశువు జన్మించడం ఇదే ప్రధమమని వైద్యులు తెలిపారు. పాపను ఐసీయు ఇంక్యుబేటర్‌లో ఉంచి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రక్తంలో సోడియం స్థాయి ఎక్కువైనపుడు పిండం ఎదుగుదల ఆగిపోతుంది. దీని వలన చర్మం ఏర్పడటంలో సమస్యలు ఏర్పడతాయి. ఆ కారణంగానే పైన చర్మం లేకుండా శరీరంలోని అవయవాలు కనిపించేలా ఇలాంటి శిశువులు జన్మిస్తారని, ఈ బేబీ గురించిన వివరాలను ఎయిమ్స్‌కి పంపామని డాక్టర్లు తెలిపారు. 1750లో అమెరికాలోని దక్షిణ కరోలినా ప్రాంతంలో మొట్టమొదటగా ఇలాంటి శిశువు జన్మించినట్టుగా వైద్య రికార్డులు చెబుతున్నాయి. తరువాత అమెరికాలో అయిదారుగురు వరకు హర్లీ క్వీన్ బేబీలు జన్మించారు.
1984లో పాకిస్తాన్‌కి చెందిన ఒక మహిళకు వరుసగా నాలుగు కానుపుల్లో ఇలాంటి శిశువులే జన్మించారు. పుట్టిన తరువాత గంటల వ్యవధిలోనే వారు మరణించారు. ఇలా పుట్టినవారు రోజుల్లోనే ప్రాణాలుకోల్పోతారని, ఒకరిద్దరు యుక్త వయసు వరకు బతికారని వైద్యులు వెల్లడించారు. మనదేశంలో చత్తీస్‌గఢ్, బస్తర్ ప్రాంతాల్లో ఇలాంటి శిశువులు జన్మించినట్టుగా వార్తలు ఉన్నా, వైద్యరికార్డుల్లో మాత్రం నమోదు కాలేదు.